– ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండ గా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురు స్తున్నాయి. తాజాగా.. వాతావరణ శాఖ కీలక విషయాలను వెల్లడించింది. వచ్చే 24 గంటలపాటు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిం చింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, ఖమ్మం, మహబూ బాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే, ఆయా జిల్లాల్లో వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆయా జిల్లాల్లో కొన్ని ప్రాతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ వ ర్షాలు నమోదవుతాయని తెలిపింది. రాష్ట్రం లో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నా యని తెలిపిన వాతావరణ శాఖ.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయ టకు వెళ్లొద్దని తెలిపింది. భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాం తాలకు వెళ్లాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





