హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి అన్ని విధాల సహాయాన్ని అందిస్తుందన్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని, వారందరికీ అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారిశ్రామిక భద్రత ప్రమాణాల మెరుగు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
పాశమైలారం ప్రమాదంపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి
