హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు సీపీఐ నాయకులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆర్టీసీతోపాటు పలు ప్రజా సమస్యలు, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై సీపీఐ నాయకులు ముఖ్యమంత్రితో చర్చించారు.
సీఎం రేవంత్‌ని కలిసిన సీపీఐ నాయకులు
