– కేంద్రానికి తొత్తుగా మారిన ఎన్నికల సంఘం
– బెంగాల్లో 92 లక్షల ఓట్ల తొలగింపే నిదర్శనం
– బీఎల్ఏల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ విమర్శలు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 16: బీజేపీకి లాభం చేకూర్చేలా ‘సర్ ప్రక్రియ సాగుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీలకు ప్రయోజనం చేకూరేలా నిర్వహించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మంగళవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ పేరుతో 92 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని వివరించారు. ఈ పక్రియలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డితోపాటు తన ఓటు గల్లంతు అయినా ఆశ్చర్య పోనక్కర్లేదని వ్యంగ్యంగా అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని ,అలాంటి దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా మారిందని ఆరోపించారు. 2002లో ఎస్‌ఐఆర్ పక్రియ పారదర్శకంగా జరిగిందని.. కానీ ప్రస్తుతం వారికి ఓట్లు పడవనుకుంటే వాటిని తొలగిస్తుందన్నారు. తమ ఓట్లు క్షేమంగా ఉండాలంటే బీఎల్‌ఏ కీలకంగా పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో తనకు దామోదర రాజనర్సింహ ఓనమాలు నేర్పించారని గుర్తు చేసుకున్నారు. ఈ దేశంలో అతికొద్దిమంది నిజాయితీ పరుల్లో నాక్షి నటరాజన్ ఒకరని పేర్కొన్నారు. అకారణంతోనే ఆమె రాజ్యసభ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారని తెలిపారు. బీజేపీ వాళ్లకి కనికరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం అధికారంలో ఉండి చక్రవర్తుల్లా ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కంటే పెద్ద చక్రవర్తులే నేలమట్టం అయ్యారు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎంత..? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం అనుకుంటే.. వారు మూర్ఖులే అవుతారన్నారు. దేవుళ్లకు ఎవరు వ్యతిరేకం కాదు.. కానీ దేవుడి పేరు చెప్పనిదే బీజేపీ వాళ్లకు ఓట్లు పడవన్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏడాదిలో చాలాసార్లు పూజలు నిర్వహిస్తారని, కానీ దేవుళ్ల పేరుతో తాము ఓట్లు అడగమని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారంటూ కేంద్రంపై టీపీసీసీ చీఫ్ నిప్పులు చెరిగారు. ఇకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని టీపీసీసీ చీఫ్ విమర్శించారు. కమలం పార్టీ ఆడించినట్టే.. ఆయన ఆడుతున్నారని ఆరోపించారు. సానుభూతి తమకేం అవసరం లేదని పవన్‌కు స్పష్టం చేశారు. కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని పవన్‌కు సూచించారు. తెలంగాణ వచ్చినప్పుడు 10 రోజులు అన్నం తినలేదని పవన్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చిట్టా ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్టానికి ఇంకా నిధులు రావాల్సి ఉందన్నారు. విభజన హాలను ఇప్పటి వరకు నెరవేర్చలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రు సబర్మతి కట్టుకో వచ్చు.. తాము మూసి ప్రక్షాళన చేస్తామంటే నిధులు ఇవ్వరని అసహనం వ్యక్తం చేశారు. వీటికి సమాధానం చెప్పాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్పష్టం చేశారు. ఓ వైపు బీజేపీ, మరో వైపు బీఆర్‌ఎస్ పార్టీలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చీఫ్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



