– రాష్ట్రంలో 16శాతం ఫోక్సో కేసులు నమోదు
– ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ మోదీ భేటీ బచావో భేటీ పడావో అంటారు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తెలంగాణలో ఉన్నారు.. రాష్ట్ర హోం మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. పోక్సో కేసులు దేశంలో 6 శాతం నమోదు అయితే రాష్ట్రంలో 16శాతం నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి శాంతిభద్రతలపై ఇప్పటివరకు సమీక్ష చేయలేదని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ సర్పంచ్ చిన్నారిపై దాడి చేస్తే పోలీసులు సెటిల్ చేశారంటూ మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం అంటున్నారు. ముందు చిన్నారులను కాపాడండి అని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీకి తెలియవా అని ప్రశ్నించారు. బండి భగీరథ్ కేసు విషయంలో తొలుత వీక్ సెక్షన్లు పెట్టారు. రాష్ట్రంలో మహిళలు రోడ్డు ఎక్కితే సెక్షన్లు మార్చారని గుర్తు చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు ధైర్యం ఉండేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.