రెస్టారెంట్‌లో కాల్పులు

– నలుగురి మృతి.. 8మందికి తీవ్ర గాయాలు

న్యూదిల్లీ, మే 19 : తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఓ యువకుడు రెస్టారెంట్‌లో తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో నలుగురు చనిపోగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ తుర్కియేలోని మెర్సిన్ సిటీలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానిక విÖడియా కథనాల ప్రకారం 17 ఏళ్ల ఓ యువకుడు సోమవారం రాత్రి టార్సస్‌లోని ఓ రెస్టారెంట్‌లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న షాట్ గన్‌తో రెస్టారెంట్‌లోని వారిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. చనిపోయిన వారిని రెస్టారెంట్ యజమాని, రెస్టారెంట్ సిబ్బంది, పశువుల కాపరి, ట్రక్ డైవర్‌గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *