తొలి రోజు మంచులింగం దర్శించుకున్న 12 వేల మంది భక్తులు

జమ్ము, జులై 4: కట్టుదిట్టమైన భద్రత, వాతావరణ అవాంతరాల మధ్య హర హర మహాదేవ్‌ అం‌టూ బయల్దేరిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్‌ ‌మంచుశివలింగ తొలి దర్శనమైంది. అమరనాథ్‌యాత్రలో భాగంగా శుక్రవారం తొలిరోజు 12 వేల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని హిమాలయాల్లో ఏటా ఈ సమయంలో ఏర్పడే మంచు లింగాన్ని పూజించేందుకు గురు, శుక్రవారాల్లో నువ్వాన్‌, ‌బాల్‌టాల్‌ ‌బేస్‌ ‌క్యాంపుల నుంచి రెండు బృందాలు బయలుదేరాయి. శుక్రవారం దర్శనం చేసుకున్నవారిలో 9,350 మంది పురుషులు, 2,250 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *