- ప్రాక్టీస్‌లో గాయంతో నీరజ్ చోప్రా పోటీలకు దూరం
న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : జపాన్‌లో సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల ముంగిట భారత బృందానికి షాక్ తగిలింది. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయపడ్డాడు. శిక్షణ సమయంలో అతడి చీలమండ లిగమెంట్‌కు గాయమైంది. దీంతో ఆసియా క్రీడలకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా శనివారం సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘ఎంతో కష్టపడిన తర్వాత లుసానె డైమండ్ లీగ్‌లో ఈ సీజన్‌లో అత్యుత్తమ (88.05 టర్లు)త్రోను అందుకున్నట్లు అనిపించింది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొద్ది కాలానికే శిక్షణ సమయంలో నా చీలమండ వద్ద లిగమెంట్ చిట్లిపోయింది.. వైద్యుడితోపాటు నా టీమ్‌తో చర్చించిన అనంతరం ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.. ఇది నిరాశ కలిగించే విషయం.. నా ఆటలో రిథమ్‌ను అందుకునే దశకు చేరుకున్నానని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరం.. ఇప్పుడు నా దృష్టి పూర్తిగా కోలుకోవడం, మరింత దృఢంగా తిరిగి రావడంపైనే ఉంది‘ అని చోప్రా పేర్కొన్నాడు. ఈ గాయం కారణంగా సెప్టెంబరు 5న బ్రసెల్స్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు కూడా దూరంకానున్నాడు. సెప్టెంబరు 11 నుంచి 13 వరకు జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ అల్టిమేట్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పాల్గొనడం లేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





