సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యవర్గం ఏకగ్రీవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సచివాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎన్నికల అధికారులు నూతన బాధ్యులకు సర్టిఫెక్‌టెన్ అందజేశారు. సంఘం ఐక్యతను చాటుతూ అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. సంఘం అధ్యక్షుడిగా మంగదొడ్డి శ్రీనివాసులు (ఎస్‌వో, బీసీ వెల్ఫేర్), ప్రధాన కార్యదర్శిగా టి.వెంకటరమణ (ఎస్‌వో) ఐటీ అండ్ క్యాడ్), అడిషనల్ సెక్రటరీగా జి.శ్రవణ్ కుమార్ (ఎస్‌వో, జీఏడీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఉడుత అశోక్ (జీఏడీ), జి.లావణ్య లత (పీఆర్ అండ్ ఆర్‌డీ) ఎన్నికవగా, జాయింట్ సెక్రటరీలుగా అంబటి వీరాంజనేయులు (ఈఎఫఎస్ అండ్ టీ), కూరపాటి ఆశాజ్యోతి(పీఆర్ అండ్ ఆర్ డీ), కమటం తిరుపతి(పీఆర్ అండ్ ఆర్ డీ), బి.రామ్‌గోపాల్ (లెజిస్లేచర్) బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.సైదులు (ఫైనాన్స్), పబ్లిసిటీ సెక్రటరీగా ఎస్. రామలింగయ్య(ట్రైబల్ వెల్ఫేర్), కోశాధికారిగా కాదరి నవీన్ కుమార్(జీఏడీ) ఎన్నికయ్యారు.

హక్కుల పరిరక్షణే ధ్యేయం : నూతన కార్యవర్గం ప్రతిజ్ఞ

ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందుకున్న అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలేల ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సచివాలయంలో బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రమోషన్లు, ఇతర సేవా విషయాలలో ఎదురయ్యే సమస్యలపై నిరంతరం గళం విప్పుతామని, 2025 బ్యాచ్ యువ ఉద్యోగులను కలుపుకుంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ సంయుక్తంగా ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, హుందాగా నిర్వహించిన ఎన్నికల అధికారులు చిక్కా లక్ష్మణ్, కె.రమాదేవి, రెండ్ల రాజేష్, ఎం.రవీంద్ర కుమార్, వి.కైలాసం, బి.స్వామి గౌడ్‌లను నూతన కార్యవర్గం, సచివాలయ బీసీ ఉద్యోగులు అభినందించారు.
———————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *