కూచిపూడి నృత్యంలో దక్షారెడ్డికి స్కాలర్‌షిప్

హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రి 25: కూచిపూడి నృత్యకళలో ప్రతిభ కనబచచిన హనుమకొండ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థిని రొండ్ల దక్షారెడ్డికి సాంస్కృతిక ప్రతిభా శోధన స్కాలర్‌షిప్‌ను కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ప్రకటించింది. భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం 2025-2027 కాలానికి ఈ స్కాలర్‌షిప్ అందించనున్నది.
ప్రఖ్యాత గురువు బొంపెల్లి సుధీర్‌రావు శిష్యురాలైన దక్షారెడ్డి చిన్ననాటి నుంచే కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకుని క్రమశిక్షణతో సాధన చేస్తూ లయ, భావ వ్యక్తీకరణ, నాట్య నైపుణ్యాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కఠినమైన ఎంపిక ప్రక్రియలో ఆమె ప్రతిభ చూపి ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌ను సాధించడం విశేషం. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధికి మార్గదర్శకత్వం లభించనుంది. యువ కళాకారులను ప్రోత్సహించడంలో కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. స్కాలర్ షిప్‌నకు ఎంపికైన దక్షారెడ్డిని గురువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు. ఈ సందర్భంగా గురువు బొంపెల్లి సుధీర్ రావు మాట్లాడుతూ దక్షారెడ్డి క్రమశిక్షణతో సాధన చేస్తూ మంచి ప్రతిభ కనబరుస్తున్నదని, భవిష్యత్తులో ఈ రంగంలో ఉన్నతస్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు జ్యోతిర్మయి, నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కూచిపూడి నృత్యకళలో తమ కుమార్తె దక్షారెడ్డికి ఈ స్కాలర్‌షిప్ లభించడం సంతోషంగా ఉందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *