– కవితకు రాజకీయ సమాధి కట్టిందే బీజేపీ
– మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారంనాడాయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు పిట్టల దొరను చూశారని, ఇప్పుడు పిట్టల దొరసానిని చూస్తారని వ్యంగ్యంగా అన్నారు. కవితకు బీజేపీ రాజకీయ సమాధి కట్టిందని గుర్తు చేశారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును శనివారం ప్రకటించిన సందర్భంగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అర్వింద్ స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం బీజేపీ మద్దతు లేకుండా వచ్చిందా అంటూ కవితను సూటిగా ప్రశ్నించారు. ఇండియా-పాకిస్థాన్ విభజన పక్రియలో ఎంతోమంది చనిపోయారని వివరించారు. వీళ్లు ప్రకటించి వెనక్కి తీసుకున్నారు కాబట్టే ప్రత్యేక రాష్ట్రం కోసం అనేకమంది చనిపోయారని చెప్పారు. ఇదే విషయంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్‌సభలో ప్రస్తావించారన్నారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ కళ్ళద్దాలతో చూడకండంటూ రాజకీయ పార్టీల నేతలకు ఆయన స్పష్టం చేశారు. అజారుద్దీన్ అదృష్టం బాగుందని, గవర్నర్ నిర్ణయం వల్ల మంత్రి అయ్యారన్నారు. ఏ పార్టీ ప్రజల గురించి పనిచేస్తుంది అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన అందించారని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





