– విద్యా ప్రతిభ, పరిశోధనాభివృద్ధికి ఉపయుక్తం
హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జెఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. హనుమకొండ విద్యానగర్‌లోని సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (ఆటానమస్) సంస్థ, మైసూరులోని జెఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జెఎస్ఎస్ ఏహెచ్ ఈఆర్)తో ఎంఓయు పునరుద్ధరించినట్లు కళాశాల చైర్మన్ పి.జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం 2020లో ప్రారంభమై విజయవంతమైన భాగస్వామ్యానికి కొనసాగింపుగా ఉండి విద్యా ప్రతిభను, పరిశోధనాభివృద్ధిని పెంపొందించేందుకు రెండు సంస్థల సంకల్పాన్ని మళ్లీ బలపరుస్తుందన్నారు. పునరుద్ధరించిన ఎంఓయు ద్వారా సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, పీజీ శిక్షణ, విద్యా వనరులు, నైపుణ్యాలను పంచుకోవడం వంటి రంగాలలో సహకారం పెంపొందించుకోనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా ఇది ఫార్మాస్యూటికల్, హెల్త్ సైన్సెస్‌లో అంతరశాఖీయ అభ్యాసం, నవీనత, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రో-చాన్సలర్ డాక్టర్ బి.సురేష్, వైస్ చాన్సలర్ డాక్టర్ బసవనగౌడప్ప, రిజిస్ట్రార్ డాక్టర్ బి.మంజునాథ, డీన్(అకాడమిక్స్) డాక్టర్ విశాల్ కుమార్ గుప్తా ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ జైపాల్ రెడ్డి, విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్‌ల సమక్షంలో ఈ ఎంవోయÖ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశ్యం జ్ఞాన మార్పిడి, ఉన్నత ప్రమాణాల పరిశోధన, విద్యార్థులు, అధ్యాపకులను అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో సిద్ధం చేసే చురుకైన విద్యా వాతావరణాన్ని నిర్మించడం. ఈ భాగస్వామ్యం ద్వారా రెండు సంస్థలు ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఆరోగ్యరంగంలో ఉద్భవిస్తున్న సవాళ్లను కలిసి ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని జైపాల్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ సహకారం అధునాతన పరిశోధన కార్యక్రమాలు, సంయుక్త ప్రచురణలు, పరిశ్రమ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు, నవీనత ఆధారిత ప్రాజెక్టుల వైపు విస్తరించనుందన్నారు. ఇది విద్యా చలనం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల పరిచయం, భవిష్యత్తుకు సిద్ధమైన నిపుణుల అభివృద్ధికి మార్గాలను సృష్టిస్తుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





