కో ఆప్షన్ ఎన్నికల్లో ఐదూ బీజేపీ కైవసం

– నలుగురు బీఆరఎస్ కార్పొరేటర్లూ బీజేపీకి జై
– ఓటింగ్‌కు దూరంగా కాంగ్రెస్
సామాన్యులకే పట్టం
– కరీంనగర్ కార్పొరేషన్‌లో చక్రం తిప్పిన బండి

కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శనివారం జరిగిన కో అప్షన్ ఎన్నికలో ఐదింటికి ఐదు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ కో అప్షన్ సభ్యుల గెలుపు పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్య‌క్తం చేశారు. కాషాయ జెండా మోసిన కార్యకర్తలకే పట్టం కట్టారన్నారు. ఆచితూచి ఎంపిక చేయాలనే మంత్రి బండి ఆదేశాలను అభ్యర్థులు, ఎంపిక కమిటీ సభ్యులు పక్కాగా అమలు చేశారు. ఓటింగ్‌కు హాజరై బీఆరఎస్ భంగపడగా ఎలాగూ గెలవమని తెలిసి ఓటింగ్‌కు హాజరు కాకుండా కాంగ్రెస్ పరువు నిలబెట్టుకున్నది.

అభ్యర్థుల ఎంపికపై ఇతర పార్టీల ఆశ్చర్యం

మైనారిటీ విభాగంలో పార్టీని నమ్ముకుని పనిచేసిన ముజీబ్ తల్లికి ప్రధాన్యం లభించింది. రెండు దశాబ్దాలుగా సామాన్య కార్యకర్తగా బీజేపీ¾లో ఉన్న ముజీబ్ లాంటి కార్యకర్తకు కో ఆప్షన్ ఇవ్వడం గొప్ప నిర్ణయం అంటున్న బీజేపీ శ్రేణులు. మైనారిటీ విభాగంలో మరో సీటులో బల్బీర్ సింగ్‌కు ఇచ్చారు. పట్టణంలో సిక్కుల ప్రాధాన్యత దృష్ట్యా సామాన్య కార్యకర్తకు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం లభించింది. కీలక పదవి తనకు ఇవ్వడంపై బల్వీర్ సింగ్ అవాక్కయ్యారు. పార్టీని నమ్ముకుని ప్రజల్లో తిరుగుతున్న బల్వీర్ సింగ్‌కు పదవి ఇవ్వడం పట్ల సిక్కులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మకల్ ప్రాంతానికి చెందిన నందన్ కుమార్ అత్యంత సామాన్య కార్యకర్త. ఉండడానికి సరైన ఇల్లు లేదు. ఆయన ఎంపికపై ఇతర పార్టీలు ప్రజలు నిర్ఘాంతపోయారు. ఈ ఎంపికతో బీజేపీ¾ కార్యకర్తలకు ఎంతటి ప్రాదాన్యత ఇస్తున్నదో అర్థమవుతుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండా మోస్తూ బీజేపీని ప్రాణంగా భావిస్తున్న నందకుమార్‌కు కీలక పదవి ఇవ్వడంపై శ్రేణుల్లోనూ dసంతోషం వ్యక్తమవుతోంది. ఎస్సీ మహిళా విభాగంలో చిగురు రవి తల్లి చిగురు వెంకటమ్మకు అవకాశం ఇచ్చారు. బీజేపీ మాజీ కార్పొరేటర్‌గా ప్రజలకు మంచి చేసిన సామన్యురాలికి మరోసారి కార్పొరేషన్‌లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది. నగరంలో మంచిపట్టు ఉన్న కన్నె కృష్ణకు పదవి రావడం పట్ల ఆర్యవైశ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పదవుల పంపిణీలో బండి సంజయ్ సామాజిక సమీకరణాలు పాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *