ప్రభుత్వ పథకాలు చివరి లబ్దిదారుడి వరకు చేరాలి

– ప్రతి రంగంలో పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి
– గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధి దారుని వరకు చేరేలా అధికారులు సమన్వ యంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. గురువారం హనుమ కొండ జిల్లా కలెక్టరేట్ లో హనుమ కొండ, వరంగల్ జిల్లాల అధికారులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర గవర్నర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని జ్యో తి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జి ల్లాల చారిత్రక నేపథ్యం, అమలవుతున్న సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య-ఆరోగ్య సేవ లు, వ్యవసాయం, మౌలిక వసతులు, ఇతర కీలక అంశాలపై జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివ రించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపడుతున్న భద్రత తదితర చర్యలను పోలీస్ కమిషనర్ శ్వేత వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ టీబీ నిర్మూలనకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని, విస్తృత స్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమం వంద శాతం లక్ష్యంతో అమలయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులతో అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించామన్న గవర్నర్, పరిపాలనలో ఎదురయ్యే చిన్నచి న్న లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. జిల్లాల అభివృద్ధికి జిల్లా పరిపాలన, పోలీసు శాఖతోపాటు అన్ని శాఖల అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. పాలనలో పారదర్శకత అత్యంత కీలకమని, పారదర్శక వ్యవస్థ వల్ల ప్రజలకు, రైతులకు, ప్రభుత్వానికి సమానంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం కృత్రి మ మేధస్సు యుగంలోకి అడుగుపెట్టిందని పేర్కొంటూ ఏఐ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు దారి తీస్తోందన్నారు. భవిష్యత్తు లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ దానికి భయపడాల్సిన అవసరం లేదని, ఏఐని మనిషి సృష్టించాడనే విషయాన్ని గుర్తుంచుకొని దానిని సమర్థవం తమైన సాధనంగా ఉపయోగించుకుని పరిపాలన, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును  అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందనీ యమని అన్నారు. హాస్టళ్లలో అత్యవసర మౌలిక వసతులు, మరమ్మతులు, డ్రైనేజీ తదితర పనుల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్.నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, అదనవు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, వరంగల్ డీసీపీ ధారా కవిత, వివిధ జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *