విద్యుత్ లైన్ల మార్పునకు రూ.3 కోట్లు మంజూరు

– మంత్రి సీతక్క విజ్ఞప్తికి  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందన

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ములుగు నియోజకవర్గ ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నివాస ప్రాంతాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లను మార్చేందుకు ప్రభుత్వం రూ.3 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నివాస ప్రాంతాల మీదుగా విద్యుత్ లైన్లు వెళ్లడం వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, భద్రతాపరమైన సమస్యలను మంత్రి సీతక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రమాదాల ముప్పును తగ్గించేలా విద్యుత్ లైన్లను మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సీతక్క విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో విద్యుత్ లైన్ల మార్పునకు రూ.3 కోట్లT కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషిచేసిన మంత్రి సీతక్కకు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *