విద్యారంగంలో తెలంగాణ దేశానికే ఆద‌ర్శం

– వ‌చ్చే ఏడాదినుంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్
–  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్
– ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన రూఫ్ టాప్ సోలార్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: రాష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారించారని వారి అంచనాలకు అనుగుణంగా ఆర్థిక శాఖలో ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉన్నతస్థాయి అధికార బృందం అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ కు వెళ్లి ప్రత్యేకంగా రూములు తీసుకొని, భారీగా వెచ్చించి కోచింగులు తీసుకునే అవసరం లేకుండా నియోజకవర్గ కేంద్రాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. పోటీ పరీక్షలకు కావలసిన పూర్తి మెటీరియల్ తోపాటు డిజిటల్ లైబ్రరీ ఈ నాలెడ్జ్ సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశానికి ఆదర్శంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో గేమ్ చేంజర్ గా నిలిచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నట్టు వివరించారు.  వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఆలోచనలో ఉన్నామని ఆ మేరకు ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్న‌దని తెలిపారు. మారిన పరిస్థితిలకు అనుగుణంగా ఐటిఐ లను అడ్వాన్స్ డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్  చేసుకుంటున్నాం ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలకు అవసరమైన అన్ని వసతులు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేట్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రతి మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు దశలవారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించి ముందుకు పోతున్నట్టు తెలిపారు. ప్రతి 10 గ్రామాలకు ఒక పాఠశాలను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఈ పాఠశాలల్లో తరగతి గదులు, మౌలిక వసతులు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాప్ కొరత లేకుండా దశలవారీగా పాఠశాలలను అప్ గ్రేట్ చేస్తామని వివరించారు. విద్యాశాఖ పై దృష్టి సారించి టాప్ ప్రియారిటీ  కింద కావలసిన నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇంటర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సిఎస్ఆర్ నిధుల ద్వారా స్థానికంగా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన సోలార్ పవర్ ఉత్పత్తి కోసం సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామ‌న్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారానా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆదిత్య భాస్కర్, ఈడ‌బ్ల్యుఎస్ ఐడి ఎండి గణపతి రెడ్డి, ఎన్‌పీడీసీఎల్  సిఎండి వరుణ్ రెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page