తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– లోయలో పడ్డ వ్యాన్ : పదిమంది దుర్మరణం

చెన్నై, ఏప్రిల్ 17: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ శుక్రవారం లోయలో పడ్డ ఘటనలో 10మంది దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై ఘాట్ రోడ్డులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన వ్యాన్ పైనుంచి లోయలోకి పడడంతో నుజ్జునుజ్జయింది. వ్యానులో ఉన్నవారిలో పదిమంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు పది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై వేగంగా దూసుకు వెళుతున్న కారు టైర్ పేలింది. ఒక్కసారిగా అదుపుతప్పిన కారు వేగంగా వెళ్లి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా కారుకు వ్యాపించాయి. మంటల్లో కారు, బస్సు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు కాలి బూడిదయ్యారు. బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *