రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం –
బస్సును ఢీకొట్టిన టిప్పర్, పలువురికి తీవ్ర గాయాలు
చేవెళ్ల (రంగారెడ్డి):
రంగారెడ్డి జిల్లాలో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించి ఆందోళనకు గురిచేసింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాద్–బీజాపూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తాండూర్ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.సాక్షుల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఢీ కొట్టిన ప్రభావంతో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు వాలిపోయింది. గాయపడిన వారిని వెంటనే చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కొంతమందిని మరింత చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.ఇప్పటి వరకు 20 మంది చనిపోనట్లు సమాచారం.ఈ ఘటనతో చేవెళ్ల–వికారాబాద్ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు శుభ్రపరిచే పనులు ప్రారంభించారు.





