– మృతులు సంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు
సంగారెడ్డి, నవంబర్ 5: కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా గుర్తించారు. వీరంతా గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





