– మరోమారు ప్రజలు పట్టం కట్టబోతున్నారు
– ప్రజల్లో మార్పు గమనించానన్న మోదీ
న్యూదిల్లీ, నవంబర్ 5: బీహార్‌లో గత ఇరవై ఏళ్లలో కనీవినీ ఎరుగని విజయాన్ని ఎన్డీయే ఈసారి సాధించబోతోందని, ఓటర్లు ఆ మేరకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మరోమారు ఎన్‌డీఏదే బీహార్ అని అన్నారు. ప్రజల్లో కనిపిస్తున్న మార్పునకు ఇది సంకేతం అన్నారు. ’ఆటవిక రాజ్య’ నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీహార్లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రతిచోటా మునుపటి సభ కంటే భారీగా ప్రజలు వస్తున్నారని, ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని చెప్పారు. బీజేపీ`ఎన్డీయే మహిళా కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన నమో యాప్ ద్వారా ప్రసంగించారు. ’మేరే బూత్.. సబ్‌సే మజ్‌బూత్’ అనే సంకల్పంతో బీజేపీ మహిళా కార్యకర్తలు అమోఘమైన కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. ‘బీహార్ ఎన్నికలను నేనెంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను.. ఎన్డీయేదే గెలుపు అని ఖాయంగా చెప్పగలను.. విజయంపై నాకెలాంటి సందేహం లేదు.. పోలింగ్ మాత్రం ఇంకా పెరగాలని కోరుకుంటున్నా’నని చెప్పారు. మహిళల సులభతర జీవనాన్ని మెరుగుపరడానికి, వారికి సాధికారత కల్పించడానికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. తమ కూటమి విజయం కోసం బీహార్ ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పిన ఓ మహిళతో మోదీ మాట్లాడుతూ పేదలు, దళితులు, మహా దళితులు, బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల్లోనూ ఇదే భావన ఉందని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





