హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : డాలర్ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్ రేట్‌లో కోతపై కూడా ఆశలు సన్నగిల్లుతుండటంతో బంగారం రేటు నానాటికీ పడిపోతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ప్రతిఫలిస్తూ భారత్‌లో కూడా పసిడి ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం బుధవారం ఉదయం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,22,540గా ఉంది. మంగళవారంతో పోలిస్తే సుమారు రూ.800 మేర ధరలో కోత పడిరది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,450 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో కూడా భారీగా కోత పడిరది. కిలో వెండి ధర రూ.3200 మేర తగ్గి రూ.1,50,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 3,969 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్ సూచీ 0.12 శాతం మేర పెరిగి 99.99కు చేరుకుంది. గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. దీంతో, పసిడి, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఈ వారమంతా బంగారం ధరల్లో దిద్దుబాట్లు తప్పవనేది మార్కెట్ వర్గాల అంచనా.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





