అమెరికాలో రోడ్డు ప్రమాదం

– గార్లకు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం

మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన ఇద్ద‌రు యువ‌తులు మృతిచెందారు. ఈ ప్ర‌మాదం  రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) దుర్మరణం చెందారు. మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూంకు బయల్దేరారు. ఈ క్రమంలో అలబామా హిల్స్‌ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడిరది. దీంతో వారిద్దరూ మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యువతుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page