రేవంత్‌రెడ్డి పెద్ద శాడిస్ట్‌

మేము ఎవరి కాళ్లు ఒత్తలేదు
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : తాము ఎవరి కాళ్లు ఒత్తలేదని, లుచ్చా పనులు అసలే చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. లుచ్చా పనులు చేసి కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.  ఫ్రస్టేషన్‌లో తనను తిడుతున్నావ్‌.. ప్రశ్నిస్తే తాను సైకోనా అని ప్రశ్నించారు. కొండారెడ్డిపల్లిలో నీ కోసం పనిచేసిన మాజీ సర్పంచ్‌ ఆత్మహత్యకు కారణమయ్యావన్నారు. మరి నువ్వు శాడిస్ట్‌ వా అని నిలదీశారు. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే యత్నం చేస్తున్న శాడిస్ట్‌ ముఖ్యమంత్రివని కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మృత్యువుతో పోరాడి చనిపోయిన శ్కెలజకు సంతాపం తెలిపారు. గురుకులాల్లో చనిపోయిన 48 మంది విద్యార్థుల మృతి బాధాకరమని పేర్కొన్నారు.  గురుకులాల్లో పరిస్థితులపై రేవంత్‌ ఇప్పటివరకు సమీక్ష జరపలేదని, ఆందోళనలో ఉన్న లక్షలాది మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల తరపున రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని హెచ్చరించారు. రాహుల్‌ తిట్టినందుకు రేవంత్‌ రెడ్డి ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నాడని, చిట్టి నాయుడికి చిప్‌ దొబ్బినట్లు అనిపిసుందని ఎద్దేవా చేశారు. అదానీతో బీఆర్‌ఎస్‌ అనుబంధం ఉందని రేవంత్‌ ఆరోపించాడని, జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా?.

రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయా?. ఎంపీగా పనిచేసినోడికి ఈ మాత్రం తెలియదా?. 700 కేవీ ట్రాన్స్‌మిషన్‌ ల్కెన్ల ప్రాజెక్టు కూడా కేంద్రానిదేనని తెలిపారు. డ్క్రెపోర్ట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారని, కేంద్రం అనుమతి ఇస్తే డ్క్రెపోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. మైక్రోసాప్ట్‌ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు. రెండోసారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గుర్తు చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్‌ అని రిలీజ్‌ చేశాడన్నారు. మైక్రోసాప్ట్‌ డేటా సెంటర్‌ పెట్టుబడిని అదానీ డేటా సెంటర్‌ అని తప్పుడు ప్రచారం చేశారు. నీకు సబ్జెక్ట్‌ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటకలుస్తుంది. గతంలో కూడా విప్రో ఛ్కెర్మన్‌ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలయ్యాడని కేటీఆర్‌ అన్నారు. మైక్రోసాప్ట్‌ వొచ్చాక ఆమెజాన్‌ వొచ్చిందని, ఆమెజాన్‌ రూ.36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందని అన్నారు. మొత్తం రూ. 67వేల కోట్ల విదేశీ పెట్టుబడులను మేము తీసుకొస్తే నేను అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్‌ చేశాడన్నారు. బరాబర్‌ దావోస్‌లో కలిశానని, ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్‌లో పెట్టాను. నీలాగా ఇంటికి పిలిపించుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు, కోహినూర్‌ హోటల్‌లో కాళ్లు పట్టుకోలేదు. ఏదీ చేసినా బజాప్తా చేస్తా. అదానీ మేము అసలు ఎంకరేజ్‌ చేయలేదు.

మీలా ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాది కాదు.
కొడంగల్‌లో వృద్ధుడ్కెన సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్‌ని వేధించారు. సాయిరెడ్డి ఇంటి ముందు గోడ కడితే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. శ్కెలజ కుటుంబానికి పరామర్శకు వెళ్తామంటే మా ఎమ్మెల్యే లక్ష్మిని అడ్డుకున్నారు. కొడంగల్‌లో 9 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ ఫ్యాక్టరీ పెడతారట. రామన్నపేటలో ప్రజలు తిరగబడితే కొడంగల్‌లో సిమెంట్‌ ఫ్యాక్టరీ పెడుతున్నారు. అదానీ, అల్లుడు, అన్నలు, బావమరిది కోసం రేవంత్‌ పనిచేస్తున్నారు. అదానీ గత నెల 14న రేవంత్‌కు చెక్‌ ఇచ్చాడు. ఇంతవరకు ఆ చెక్‌ ఎందుకు క్యాష్‌ చేయలేదు?. అదానీ గజదొంగ అని మొన్న ముంబ్కెలో రేవంత్‌ మాట్లాడారు. అదానీ గురించి నిన్ననే తెలిసిందని రేవంత్‌ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేయడం లేదు. వంద కోట్లు వెనక్కి ఇచ్చి వేల కోట్లు నొక్కేసే కుట్రలు చేస్తున్నారు. గతంలో అదానీ ఆఫర్‌ను కేసీఆర్‌ తిరస్కరించారు.

ఈడీ దాడులు జరిగి రెండు నెలల్కెనా సమాచారం లేదు :కేటీఆర్‌
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు జరిగి రెండు నెలల్కెనా ఎలాంటి సమాచారం లేదంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఆ దాడుల గురించి ఏమైనా అప్‌డేట్స్‌ ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కనీసం ఈడీ అధికారుల స్టేట్‌మెంట్లు కూడా ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. ఆ రోజు నోట్ల లెక్కింపు కోసం వాడిన రెండు కౌంటింగ్‌ మెషిన్లు ఏమయ్యాయని నిలదీశారు. ఆ దాడులపై ఎందుకు ఈ నిశ్శబ్దం అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న హైదరాబాద్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నివాసంతోపాటు ఆఫీసుల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వల వ్యవహారంలో మిసెస్‌ జెడ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన కార్యాలయల్లో ఈ నెల 22న ఈడీ దాడులు నిర్వహించింది. ఒడిశా, దిల్లీ, గురుగ్రామ్‌తోపాటు 9 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో రూ.1.39 కోట్లు, రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఈడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఇంట్లో ఐటీ దాడులు జరిగి 2 నెలల్కెనా ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేకపోవడంపై కేటీఆర్‌ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page