హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసిన రేవంత్

– అభివృద్ధితో కేసీఆర్ భాగ్యనగరం ఖ్యాంతి పెంచిండు
– కాంగ్రెస్ వచ్చింది.. నీటి కొరత షురూ అయింది
– సర్చార్జీల పేరిట అడ్డగోలుగా కరెంట్ చార్జీల పెంపు
– కరెంట్ కోతలు మళ్లీ మొదలు
– 5 లక్షల సీసీ కెమేరాలు పనిచేస్తలేదు
– రెండేళ్లనుంచి పరిశ్రమలకు కార్యదర్శి లేడు
– రేవంత్ పై విరుచుకుపడ్డ హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: అభివృద్ధితో కేసీఆర్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచితే రేవంత్ ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసిండని మాజీ మంత్రి, బిఆర్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, శ్రీనాథ్, ఇతర నాయకులకు గులాబీ కండువాలు వేసి బీఆర్ఎస్ లోకి శనివారం ఆహ్వానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉన్నానా, న్యూయార్క్ లో ఉన్నానా అని నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్ అన్నడు. కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అంతగా పెంచిండు. కేసీఆర్ ఉండగా నీళ్లకు బాధ లేదు, కరెంట్ బాధ లేదు, హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నరు. రేవంత్ పాలనలో రోజుకు 80వేల వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి.కేసీఆర్ గోదావరి, కృష్ణా నీళ్లను తెచ్చి నీటి సరఫరా చేసిండు.ఇప్పుడు నీటి కొరత.కేసీఆర్ ఉచిత నల్లా ఇస్తే, ఇప్పుడు ఉత్త నల్లా అయ్యింది. సర్ చార్జీల పేరిట అడ్డగోలుగా కరెంట్ చార్జీలు పెంచిండు రేవంత్. పీజేఆర్  ఉన్నప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శన ఉండే. బిఆర్ఎస్ పాలనలో బంద్ అయ్యింది. మల్లా కాంగ్రెస్ వచ్చింది నీళ్ల బిందెలు వచ్చినయి. కరెంట్ కోతలు మొదలైనయి. రాష్ట్రానికి రెండేళ్ల నుంచి పరిశ్రమలకు కార్యదర్శి లేడు. ఐటీకి సెక్రెటరీ లేడు. నువ్వేం పరిశ్రమలను ఆకర్షిస్తవు రేవంత్ రెడ్డి. చీఫ్ సెక్రెటరీకి ఇన్చార్జ్ ఇచ్చారు. వారికి సమయం ఉంటుందా? దృష్టి పెట్టగలరా? మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ గురించి మాట్లాడుతారా?గతేడాది తెలంగాణ రైజింగ్ పెట్టావు. ఎన్ని పరిశ్రమలు వచ్చినయి వైట్ పేపర్ విడుదల చేయి.కేసీఆర్ 10లక్షల సీసీ కెమెరాలు పెట్టించారు. అందులో ఈరోజు 5లక్షల పని చేయని పరిస్థితి. నువ్వే హోం మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి.. శాంతి భద్రతలు లేవు. మున్సిపాలిటీలో చెత్త ఎత్తుత లేవు అంటడు రేవంత్ రెడ్డి. నువ్వే మున్సిపల్ మంత్రి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా తాగు నీటి సమస్య, దోమల సమస్య. ఉన్న నగరాన్ని పట్టించుకునే చేతగాదు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నవు.ఒక్క హైదరాబాద్ లోనే 300 బస్తీ దవాఖానలు ప్రారంభించినం. టి డయాగ్నస్టిక్ సెంటర్లు పెట్టి 147 రకాల పరీక్షలు చేసినం. ఇప్పుడు బస్తీ దవాఖానల్లో గోలీలు కూడా లేవు. బీపీ, షుగర్ గోలీలు ఇవ్వని సర్కార్ ఇది. కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రీషన్ కిట్ బంద్, ప్రభుత్వ ఆసుపత్రల్లో డెలివరీలు బంద్ అయిన పరిస్థితి. టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్ మూడేళ్లుగా ఏమైంది.ప్రారంభించిన టిమ్స్ సనత్ నగర్ లో డాక్టర్లు లేరు.రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కానీ రేవంత్ బిడ్డ కార్పొరేట్ స్కూళ్లు ప్రారంభిస్తున్నది. అంటే విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయినట్లా. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నువ్వు బాగు చేసుంటే నీ బిడ్డ హైదరాబాద్ చుట్టూ కార్పొరేట్ స్కూళ్లు ఎందుకు పెడుతున్నది. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ చేసినవు. రెండు లక్షల ఉద్యోగాలు అని 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మేం దిగిపోయిన నాడు 43లక్షల పెన్షన్లు ఉండే. 17 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చినం.నువ్వు 4లక్షలు తీసేసి, 4లక్షలు కొత్తగ ఇచ్చినవు. నువ్వు ఇచ్చింది గుండు సున్నా. 4వేల పించన్ అని అవ్వాతాతలను కూడా మోసం చేసినవు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వక చదువులు ఆగిపోతున్న పరిస్థితి. 20వేల కోట్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే 600 కోట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ పని అయిపోయింది,. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నది అని చెప్పడానికి తెలంగాణ భవన్ లో ప్రతిరోజు జరుగుతున్న చేరికలే నిదర్శనం. పార్టీ మారిన దానం నాగేందర్ ను హైకోర్టు డిస్ క్వాలిఫై చేసింది. రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని సర్వేల్లో తేలుతున్నది రాష్ట్రంలో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని. కేసీఆర్ ప్రభుత్వమే అని. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మల్లా కాంగ్రెస్ అధికారంలోకి రాదు అంటున్నడు. రూ.5లక్షల కోట్ల అవినీతికి రేవంత్ పాల్పడ్డడు అంటున్నడు. ఇంకో ఎమ్మెల్యే 20శాతం లంచం ఇస్తేనే పని అవుతుందని అంటున్నడు. వాళ్ల ఎమ్మెల్యేలే తిరగబడుతుంటే ఆసహనానికి లోనవుతున్నడు. కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నడు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క కరిచింది, వీళ్లను తీసుకుపోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో వేయాలంటున్నడు. రేవంత్ పిచ్చి ఎంత పీక్స్ కు పోయిందో అర్థం అవుతున్నది. ఎర్రగడ్డల వేయాల్సి వస్తే మొదలు రేవంత్ రెడ్డిని వేయాలి. సిద్దిపేటలో ఇందిరమ్మ బీమా అని పెట్టి ఒక్క మాట మాట్లాడలేదు. బిజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నయి. కరువు వచ్చినా కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదు, కరువు బృందాలు రాలేదు. బడే బాయ్ చోటే బాయ్ బంధానికి తెలంగాణ బలి అవుతున్నది. ఏపీకి కేంద్రం సాయం ఇస్తున్నది, కరువు బృందాలు వచ్చినయి. తెలంగాణకు మాత్రం మొండి చేయి. తెలంగాణ మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *