చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం

– పూడికతీతతో చెరువులలో జలాశయాలు నింపాలి
– చెరువుల అక్రమణలపై ఉక్కుపాదం
– జూరాల, మూసీల పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చేరువులన్నింటిని పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ రాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూడికతీత తో పునరుద్ధరించిన చెరువులలో వచ్చే వర్షా కాలంలో జలాశయాలతో కళకళలాడేలాచూ డాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్ననీటి పారుదల చెరువులపై సీనియర్ కాంగ్రెస్ నేత తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షుడు యం.కోదండ రెడ్డి ఆధ్వర్యంలో రూపొంచిన నివేదిక అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ నివేదికను తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పంపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పూడికతీత పనులపై ఎర్రమంజిల్ కాలనీ లోని నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పూడికతీత పనులు చేపట్టి చెరువుల పునరుద్ధరణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు ఆవశ్యకతను ఆయన వివరించారు.కొత్తగా ఏర్పాటు చేసే * పనిచేసేందుకని కమిటీలు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా విధి విధానాలు రూపొంచాలన్నారు. అంతే గాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా చెరువు లు ఆక్రమణలకు గురైతే తక్షణమే చర్యలు చేపట్టి స్వాధీనం చేసుకోవాలని ఆయన అధి కారులను ఆదేశించారు. ఈ విషయంలో అధి కారులు కఠినంగా వ్యవరించాలన్నారు. దాని తో పాటుగా ఎఫ్.టి.ఎల్ లెవల్ ను గుర్తించి సరిహద్దులు నిర్ణయించాలన్నారు. ఇందుకుగాను నీటిపారుదల శాఖాధికారులు రేవిన్యూ, వ్యవసాయ శాఖాధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు.
పూడిక తీతకు ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున తక్షణమే వాటిని అమలులోకి తీసుకొచ్చి పనులు ప్రారంభించేయాలన్నారు. రెండు నెలల వేసవికాలం వ్యవధిలో ఈ పను లు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సుమారు నెలన్నర క్రితమే ఈ పనులు చేపట్టాలని ఆదేశించినా ప్రతిపా దనలు రూపొందించడంలో జాప్యం ఎందుకు జరిగిందంటూ అధికారులను ఆయన నిలదీ శారు. చెరువుల స్థిరీకరణలో భాగంగ చెరువు కట్టలు, తూములు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి మ్యాపింగ్ చేయలన్నారు. నీటి పారుదల శాఖా వద్ద ఇప్పటికే ఉన్న సమాచా రం ఆధారంగా చెరువుల పునరుద్ధరణలో భాగంగా పూడిక తీత పనులతో పాటు చెరు వు కట్టలను బలోపేతం చేస్తూ తూముల మర మ్మతులు చేపట్టాలన్నారు. జూరాల, మూసి ప్రాజెక్టుల పూడిక తీతకు సంబంధించిన ప్రతి పాదనలను తక్షణమే రూపొంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *