– 107 కోట్లతో చేపట్టిన ‘హైడ్రా’
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : నగరంలో వరదల నివారణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘హైడ్రా’ చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.107 కోట్ల భారీ వ్యయంతో మరో నాలుగు ప్రముఖ చెరువుల అభివృద్ధి పనులను సంస్థ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు, కాముని చెరువుల వద్ద ఆయన స్వయంగా భూమి పూజ చేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పునరుద్ధరణ జాబితాలో ఇబ్రహీం పెద్ద చెరువు, భగీరథమ్మ చెరువు, కాముని చెరువు, కాప్రా చెరువు ఉన్నాయి. మొత్తం 311 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ నాలుగు చెరువులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. వీటిని జలాశయాలుగానే కాక స్థానికులకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రాలుగా మార్చనున్నారు. ఇందులో భాగంగా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద చెరువుల్లో పర్యాటక శాఖ సహకారంతో త్వరలో బోటింగ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





