రిజర్వేషన్లపై హైకోర్టులో వాడీవేడి వాదనలు

– 42శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
– ఇంటింటి సర్వే ప్రకార్మమే రిజర్వేషన్ల ఖరారు
– హైకోర్టు దృాష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రెండో రోజు విచారణలో ఇరువర్గాలు ధర్మాసనం ఎదుట వాడివేడి వాదనలు వినిపించాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లపై సమగ్ర సర్వే చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణలోనే కులగణన జరిగిందని పేర్కొన్నారు. ఇంటింటి సర్వేకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని, ఆ సర్వే డేటా ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. బీసీల్లో వెనుకబాటుతనం ఉందని గుర్తించే అసెంబ్లీ రిజర్వేషన్లను ఏకగ్రీవంగా ఆమోదించిందని ఏజీ తెలిపారు. బీసీ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అని వివరించారు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదన్నారు. మార్చి నుంచి గవర్నర్‌ దగ్గర బిల్లు పెండిరగ్‌లో ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లపై రాజ్యాంగంలో ఎక్కడా 50 శాతం సీలింగ్‌ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, అంతమంది జనాభాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వెల్లడిరచారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్‌గానే ఉందన్నారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జీవో నెం.9పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page