– చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ నాయకులతో కొట్లాట పెట్టండి
– కలిసి రావడానికి బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ సిద్ధం
– హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మాయమాటలు చెప్పి బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం దిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్‌రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా చేశారు తప్ప బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడంపై ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని విమర్శించారు. బీసీలపై తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసారని ఆరోపించారు. రేవంత్ రెడ్డీ.. ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి.. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై దిల్లీలో కొట్లాడండి.. పార్లమెంటులో చట్టం చేయించి షెడ్యూల్ 9లో చేర్చండి.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి.. ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది. దిల్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది అని హరీష్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





