– జీవో 9పైనా మధ్యంతర స్టే
– ప్రభుత్వ కౌంటర్ దాఖలుకు 4 వారాల గడువు
– ప్రభుత్వ కౌంటర్‌పై పిటిషనర్ కౌంటర్‌కు 2 వారాల గడువు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అలాగే ఇందుకు సంబంధించిన జీవో 9పై కూడా మధ్యంతర స్టే విధించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో గురువారం రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీవో 9పై స్టే విధించింది. అలాగే ఎన్నికల నోటిఫికేషన్‌పైనా స్టే ఇచ్చి షాక్ ఇచ్చింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. అనంతరం రెండు వారాల్లోపు అన్ని పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా జీవో 9ను జారీ చేసిన విషయం విదితమే. ఈ జీవో 9పై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఈ కేసు తదుపరి విచారణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





