ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి

– లేకుంటే మీరే తొలగిపోవాల్సి వస్తుంది
– ప్రధాని మోదీకి అభిజిత్‌ ‌దీప్కే హెచ్చరిక

న్యూదిల్లీ, జూలై 23: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధాని మోదీని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) అధ్య‌క్షుడు అభిజీత్‌ ‌దీప్కే గురువారం మరోసారి కోరారు. కేంద్రం స్పందించని పక్షంలో ఈ రాజీనామాల పర్వం ప్రధాని మోదీ వరకూ చేరుతుందని వ్యాఖ్యానించారు. ’మోదీ జీ.. మిమ్మల్ని మరోసారి అభ్యర్థిస్తున్నా.. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాను ఆమోదించండి. లేకపోతే ఇది ఆయన రాజీనామాకే పరిమితం కాదు.. మీ రాజీనామా వరకూ వస్తుంది’ అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్రం ఇంకా ఎందుకు అండగా ఉంటోందని అభిజీత్‌ ‌ప్రశ్నించారు. ’దేశంలోని కోట్ల మంది విద్యార్థుల కంటే ఒక విఫల, అసమర్థ మంత్రి ఎక్కువ కాదు కదా? ఒక వేళ మంత్రే ముఖ్యమని భావిస్తే దేశంలో మీకెవరూ వోటు వేయబోరన్న విషయాన్ని మర్చిపోవద్దు’ అని అన్నారు. నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌పై చర్చకు కేంద్రం మరోసారి ఆహ్వానించగా సీజేపీ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఎలాంటి చర్చ అయినా జంతర్‌మంతర్‌ ‌వద్ద లేదా మరో తటస్థ వేదికపై జరగాలని స్పష్టం చేసింది. ఇక ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని ప్రకటనపై కూడా సీజేపీ ప్రతినిధి స్పందించారు. ఇలాంటి ప్రకటనలతో ఏ ప్రయోజనం ఉండదన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా మినహా తాము మరొకటి ఆశించట్లేదని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *