-హైకోర్టులో విచారణ 6కు వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్ 30: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను హైకోర్టు జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. గత విచారణలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని పేర్కొంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-9లోని నాలుగు నిబంధనల అమలుపై తాత్కాలికంగా స్టే విధించింది. హైకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులు 6వ తేదీ జరిగే తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో సంబంధిత విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితికి తాత్కాలిక ఉపశమనం లభించిన్లటైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానానికి సంబంధించిన వివిధ అంశాలపై పిటిషనర్లు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. జులై 6వ తేదీ జరగనున్న తదుపరి విచారణలో ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలను పరిశీలించనుంది. అనంతరం హైకోర్టు మరిన్ని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసు తీర్పు రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు, విద్యాసంస్థలపై ప్రభావం చూపే అవకాశముండటంతో ఆసక్తి నెలకొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





