– గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వారిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీనిపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను త్వరగా పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల గవర్నర్‌ను కలిసి కోరారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం ప్రతిపాదించిన వీరి పేర్లను ఆమోదిస్తూ గవర్నర్ తాజాగా సంతకాలు చేశారు. దీంతో ఈ ఇద్దరూ ఇక ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





