రైతుభరోసా 7వ విడత నిధుల విడుదల

– 7 నుండి 8 ఎకరాల భూమి ఉన్న 58,831 మందికి లబ్ది
– ఇప్పటివరకు 68.96 లక్షల మందికి రూ.7,750.45 కోట్లు జ‌మ‌
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: రైతుభరోసా పథకం కింద 7వ విడతలో 7 నుండి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.259.73 కోట్లను మంగళవారం జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 58,831మంది రైతులు, 4.32 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన రైతు భరోసా సాయాన్ని పొందారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడతల వారీగా రైతు భరోసా విడుదల చేస్తున్నామని, ఇప్పటికే 6 దశలలో 7 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, ఈ రోజు 7 నుండి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుభరోసా సాయం అందించామని తెలిపారు. ఇప్పటివరకు రైౖతుభరోసా పథకం కింద మొత్తం 68.96 లక్షల మంది రైతులకు 129.17 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించి రూ.7,750.45 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతీ రైతుకు రైతుభరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *