ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారం

– బీఆర్ఎస్ రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు
– మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 :ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని బీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉందని వెల్లడించారు. ఫార్మా సిటీని కొనసాగిస్తామని ఓ వైపు కోర్టుకు చెబుతూ రేవంత్ ప్రభుత్వం జిమ్మిక్కు చేస్తోందని విమర్శించారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 75శాతం ఫార్మా సిటీ ఉండి 25శాతం మిగతావి ఉండాలన్నారు. కానీ 75 శాతం మిగతా వ్యాపారం చేసి కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. ఇది చట్ట ప్రకారం చెల్లదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తామని స్పష్టం చేశారు. ’ఇది నా మాట కాదు.. పార్లమెంట్ చట్టం. ఫార్మా సిటీ వస్తే లక్షýమందికి ఉద్యోగాలు వస్తాయని తాము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటకు వెళ్లొద్దని చేశాం. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఆఖరు సంవత్సరం ఎన్నికల హడావుడి. రేవంత్ సర్కార్ ఏవిÖ చేయలేదు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారు అని ఆరోపించారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్‌కు పేరు వస్తుందని ఇలా చేశారన్నారు. ఉన్నది ఉన్నట్టు అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అని హరీశ్ రావు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *