– ఎన్నికైన ప్రజాప్రతినిధులతోనే చర్చిస్తాం
– కేసీఆర్ లాగా కడప కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వలేదు
– ఆరఎస్ విమర్శలపై మంత్రి పొన్నం ప్రతి విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆరఎస్ సవాల్‌తో మంత్రులు గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం విÖడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీలో హరీశ్‌రావు చర్చకు రావాలని సవాల్ చేశారు. తాము ప్రెస్‌క్లబ్‌కు కూడా వస్తామని, కానీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వ్యక్తులు చర్చకు రావాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈరోజు 12 గంటల్లోగా గన్‌పార్క్ దగ్గరకు రావాలన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే తాము ఎక్కడైనా చర్చకు వస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో లాగా కడప కాంట్రాక్టర్లకు తమ ప్రభుత్వం టెండర్లు ఇవ్వలేదని తేల్చిచెప్పారు. తాము పారదర్శకంగా గురుకులాల టెండర్లు జరగాలని చూశామన్నారు. ’గురుకులాల టెండర్ కోసం ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ మాకేమైనా చుట్టమా.. టెండర్లలో అసలు అవినీతి జరిగింది రూ.2 వేల కోట్లా.. రూ.5వేల కోట్లా.. బీఆరఎస్ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. ఆధారాలతో రండి.. మేము చర్చకు సిద్ధం.. మేము అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముగ్గురు మంత్రులం గన్‌పార్క్ దగ్గర ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాం.. మేము పిరికివాళ్లం కాదు.. ఎవరితో పడితే వారితో చర్చకు రాము.. మాజీ సీఎం కేసీఆర్ గులాబీ పార్టీ నేతలను అదుపులో పెట్టుకోవాలి.. లేదంటే కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తుంది.. బీఆరఎస్ నేత ఆరఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విషయమైనా మాట్లాడేటప్ప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.. ఆయన అవినీతి చేసి ఉండొచ్చు.. ఆరఎస్పీకి మేం సమాధానం చెప్పం.. తమ జోలికి వచ్చి ప్రవీణ్ ఇబ్బందిపడొద్ద’ని మంత్రి పొన్నం హెచ్చరించారు.
బీఆరఎస్ నేతలే రాకుండా పారిపోయారు : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు. గన్‌పార్క్ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తప్ప్పు చేయలేదనే నమ్మకంతోనే ప్రజల ముందుకొచ్చి మంత్రులు చర్చకు సిద్ధమయ్యారని చెప్పారు. అలాగే హరీశ్‌రావు అండ్ కో చర్చకు రావాలని కోరితే వారు తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విమర్శలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గురుకులాలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు మంత్రులు ముందుకొచ్చారని దానం పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





