పాలమూరు ప్రయోజనాలపై చర్చకు రెడీ

– మంత్రి జూపల్లి సవాల్ కు సిద్ధం
– ప్యాకేజీ-3లో మట్టి తొలగిస్తే నీటి ప్రవాహానికి అడ్డంకులుండవు
– మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి ప్రజాతంత్ర అక్టోబర్ 21: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ ను స్వీక దించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు ప్రజలు, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను సరిదిద్దే ప్రయత్నం చేశామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయరు నీటిని తరలించే నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తీసుకున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన తూమును కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరడంతోనే ఏర్పాటు చేశామని వెల్లడించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో తక్కువ సామర్థ్యంతో నిర్మించిన కాలువల కారణంగా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అనుసంధానించే చర్యలు చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ నుంచి ఎల్లూరుకు, ఏదుల నుంచి బుద్దారం కాలువకు, వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువకు అనుసంధానం చేసే నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉందని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్యాకేజీ-3లో అడ్డంకిగా ఉన్న మట్టిని తొలగించి నీటి ప్రవాహాన్ని కొన సాగించాలని నిరంజన్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న పంపులను నడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని, పది పంపులను ఒకేసారి నడిపే విషయంలోనే సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద పంపులు సిద్ధంగా ఉన్నాయని, అక్కడి నుంచి కరివెన వరకు నీటిని తరలించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి రిజర్వా యర్ లో ఐదు టీఎంసీల నీటిని నింపే వీలుందని, మిగిలిన పనులను వచ్చే ఏడాదిలో పూర్తి చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
ప్యాకేజ్-3లో అడ్డంకిగా ఉన్న మట్టిని తొలగిస్తే నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మూడేళ్లుగా నిలిపివేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాలువల నిర్మాణ టెండర్లను ఎందుకు రద్దు చేశారు? తిరిగి టెండర్లు ఎందుకు పిలవలేదు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా చేస్తున్నదెవరు అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరే కంగా పనిచేసిన అధికారులను రాష్ట్ర సాగునీటి సలహాదారులుగా నియమించుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ మూడేళ్లుగా కోరుతున్నప్పటికీ మంత్రి జూపల్లి ఒక్కసారి కూడా ఈ అంశంపై ఎందుకు గట్టిగా మాట్లాడలేదని ప్రశ్నించారు. కృష్ణారావుకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ పాలమూరు ప్రజల ప్రయోజనాలపై లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, లేకపోయినా పాలమూరు ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడామని, ఇకముందూ పోరాడతామని నిరంజన్ రెడ్డి తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల ప్రయోజనాలే శాశ్వతమని పేర్కొన్నారు. రాజ కీయాల్లో ఎవరైనా అధికారంలో ఉండవచ్చని, అయితే తమకు అధికారం ఇచ్చిన ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన వారిని ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు. మంత్రి జూపల్లి తన సవాల్ను స్వీకరించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులపై చర్చకు రావాలని నిరంజన్ రెడ్డి కోరారు. రైతులకు ఎదురవుతున్న నీటి సమస్యలను పరిష్కరించేం దుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *