రేపిస్టును ఎన్‌కౌంటర్ చేయాలంటూ డిమాండ్..
ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 15 : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో వరస అత్యాచారాలు చేస్తూ శివకుమార్ అనే కామాంధుడు హడలెత్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్థులంతా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి అతణ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలుపుతు న్నారు.
దేశంలో ఏ మూలన చూసినా ప్రతిరోజూ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన శిక్షలు వేస్తున్నా నేరస్థుల్లో మాత్రం భయం పుట్టడం లేదు. ఒక ప్రాంతంలో అత్యాచారం జరిగిందంటూ పెద్దఎత్తున నిరసనలు జరిగిన మరుసటి రోజే మరో అత్యాచారం గురించి వినాల్సిన దుస్థితి నెలకొంది. కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్నా చివరికి ఎన్‌కౌంటర్లు జరిగిన ఘటనలు కళ్లెదుటే కనిపిస్తున్నా నిందితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని వాపొతున్నారు.