– భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
– రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడి
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 11: రాబోయే గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే గోదావరి తీర ప్రాంతాల అభివృద్దికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామన్నారు. పుష్కరాలకు ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతుందని చెప్పారు.
నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్ లేన్ రోడ్డు ఉన్న హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని, డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. హుస్నాబాద్ బస్టాండ్‌ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి పొన్నం గురువారం పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి బస్సుల వివరాలు, మౌలిక సదుపాయాలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా ఇంజినీరింగ్ కాలేజీ, టూరిజం, మెడికల్ కాలేజీ ఇండస్టీయ్రల్ కారిడార్ ద్వారా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ప్రయాణికుల సంఖ్య.. బస్టాండ్ రెవెన్యూ పరంగా ముందుందని తెలిపారు. ప్రతిరోజూ 35 వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్తుంటారని చెప్పారు. హుస్నాబాద్ బస్టాండ్‌ను పెద్ద షాపింగ్ మాల్‌గా అభివృద్ధి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



