కేంద్రం నుంచి సహకారం అందించండి

– కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి వాకిటి విజ్ఞప్తి

రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రాల సమాహారమే కేంద్రం కనుక రాష్ట్రాలకు నిధులను సమానంగా పంచాలని కేంద్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను రాష్ట్ర పశు సంవర్ధక, యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. రాజేంద్రనగర్‌లోని ఎనఎఫ్‌డీబీ కార్యాలయంలో కేంద్ర మంత్రితో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజీవ్ రంజన్ సింగ్‌ను శాలువా, పూల బొకే, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సపందర్భంగా మంత్రి వాకిటి మాట్లాడుతూ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖల్లో అమలవుతున్న పథకాలు, వాటి ఫలితాల గురించి వివరించామన్నారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న 46 వేల పెద్ద, 26 వేల చిన్న చెరువులు, 100 రిజర్వాయర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట మత్స్య శాఖ డైరెక్టర్ నిఖిల, పశు సంవర్ధక శాఖ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన సహకారం, ఆక్వా కల్చర్, లైఫ్ సైన్సెస్‌లో ఇన్సూరెన్స్, మోపెడ్ కేటాయింపుల్లో న్యాయం వంటి పలు అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులను తీసుకు రావడంలో విఫలమైందని విమర్శించారు. రాజేంద్రనగర్‌లో ఉన్న ఎనఎఫ్‌డీబీ తరలింపుపై వస్తున్న వదంతులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తరలించబోమని, రాజేంద్రనగర్‌లోనే యధావిధిగా కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి వాకిటి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *