– నిరుద్యోగుల గొంతు కోస్తున్న వ్యవస్థల వైఫల్యం
– విద్యా వ్యాపారానికి సర్కారు వత్తాసు
– బలిపీఠంపై నిరుద్యోగుల భవిష్యత్తు
(వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్)
జ్ఞాన సముపార్జనకు ఎల్లలు ఉండవని, చదువు అనేది ఒక నిరంతర ప్రవాహమని గొప్పలు చెప్పుకునే మన సమాజంలో, నేడు అదే విద్యను సరిహద్దుల పేరుతో, నిబంధనల సాకుతో చెత్తకాగితాలుగా మార్చడం అత్యంత విచారకరం. తెలంగాణ హైకోర్టు ఇటీవల దూరవిద్య డిగ్రీల చెల్లుబా టుపై ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి ంది. ఇతర రాష్ట్రాలకు చెందిన విశ్వ సెంటర్ల ద్వారా అందించే డిగ్రీలు ప్రభుత్వ విద్యాలయాలు తమ ప్రాదేశిక పరిధి దాటి స్టడీ.. ఉద్యోగాలకు పనికిరావని తేల్చి చెప్పడం, అక్షరాన్నే నమ్ముకున్న నిరుద్యోగుల ఆశలపై పిడుగు వేయడమే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సాకుతో, వ్యవస్థలు చేసిన వ్యవస్థీకృత నేరాన్ని అమాయక విద్యార్థుల తలలకు చుట్టడం ఏ రకమైన సామాజిక న్యాయ మో పాలకులు సమాధానం చెప్పాలి. అసలు ఈ మొత్తం గందరగోళానికి మూల కారణం ఎవరు? నిబంధనలు ఉల్లంఘించిన విశ్వ విద్యాలయాలా? వాటిని పర్యవేక్షించని ప్రభు త్వాలా? లేక చట్టాల చిక్కుముడి తెలియక చదువుకున్న విద్యార్థులా?
విద్యా వ్యాపారానికి సర్కారు వత్తాసు -నిరుద్యోగుల పాలిట శాపం
ఈ సంక్షోభంలో ప్రధాన దోషి ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా ప్రభుత్వ యంత్రాంగమే అవుతుంది. ఒక రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయం మరో రాష్ట్రంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని ఇవాళ కోర్టులు చెబుతున్నాయి. మరి గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ నగర గల్లీల్లో, జిల్లాల కేంద్రాల్లో ఈ స్టడీ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తుంటే విద్యాశాఖ అధికారులు ఏం
చేస్తున్నారు? బహిరంగంగా అడ్మిషన్ల ప్రకటనలు ఇస్తూ, వేల రూపాయల ఫీ జులు వసూలు చేస్తూ, ఏటా వేల మందికి ప ట్టాలు పంపిణీ చేస్తు ౦టే ఉన్నత విద్యా మండలి కళ్లు మూసు కుందా? అను మతులు లేని పక్షంలో ఆయా సెంటర్లను ప్రారంభంలోనే ఎందుకు సీజ్ చేయలేదు? విద్యా వ్యాపారం పేరిట వర్సిటీలు దందా సాగిస్తుంటే మౌనంగా ఉండి, ఇవాళ అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాల ముంగిట నిల బడ్డప్పుడు ‘మీ సర్టిఫికేట్లు చెల్లవు’ అని చెప్పడం ప్రభుత్వాల నైతిక పతనానికి పరాకాష్ట. ప్రభుత్వాల మౌనం నిరుద్యోగుల పాలిట శాప oగా మారింది.
విశ్వవిద్యాలయాల లాభార్జన విద్యా ర్థులపై నేరపూరిత వంచన విశ్వవిద్యాలయాల తీరు కూడా ఇక్కడ తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఆచార్య నాగార్జున, అన్నామలై, మదురై కామరాజ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కేవలం ఫీజుల కోసమే అడ్డగోలుగా స్టడీ సెంటర్లను విస్తరిం చాయి. యూజీసీ నిబంధనల ప్రకారం తమకు ఇతర రాష్ట్రాల్లో డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని తెలిసినా, విద్యార్థులను మభ్యపెట్టి అడ్మిషన్లు తీసుకోవడం నేరపూరిత వంచన, జ్ఞానాన్ని పంచాల్సిన సంస్థలే విజ్ఞానాన్ని విక్రయించి, ఆపై బాధ్యత నుంచి తప్పుకోవడం సిగ్గుచేటు. విద్యార్థులు ఆయా వర్సిటీల ప్రతిష్టను, ప్రభుత్వ గుర్తింపును నమ్మి చేరారు తప్ప, అడ్డదారిలో పట్టాలు పొందాలని అనుకోలేదు. వర్సిటీలు చేసిన తప్పులకు, వాటిని అడ్డుకోని ప్రభుత్వ వైఫల్యానికి సామాన్య విద్యార్థి తన జీవితాన్ని బలి ఇవ్వాల్సి రావడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు.
ఉద్యోగుల ఉన్నత విద్యపై గొడ్డలిపెట్టు -ఆత్మగౌరవానికి దెబ్బ
ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి. తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి దూర విద్యను ఆశ్రయించిన వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చదువుకోవాలనే తప నతో కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, రాత్రింబవళ్లు కష్టపడి డిగ్రీలు పొందిన వారు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఉన్నత చదువు చదివినందుకు ప్రోత్సాహం అందించాల్సింది పోయి, ‘నీ డిగ్రీ చెల్లదు’ అని వారి ఆత్మగౌ రవాన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం ఉద్యోగాల సమస్య మాత్రమే కాదు, ఒక వ్యక్తి విద్యా హక్కును కాలరాయడమే. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివితే చెల్లవన్నప్పుడు, రేపు ఇదే సూత్రం మన రాష్ట్ర వర్సిటీలకూ వర్తిస్తే మన విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది పాలకులు ఆలోచించాలి. ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యా అనుసంధానాన్ని దెబ్బతీయడం వల్ల అంతిమంగా నష్టపోయేది విద్యార్థులే.
న్యాయం వర్సెస్ మానవత్వం పీఠంపై ఒక తరం యువత
న్యాయస్థానాలు చట్టం అక్షర క్రమాన్ని మాత్రమే చూస్తాయి, కానీ ఆ చట్టం వెనుక ఉన్న సామాజిక విధ్వంసాన్ని పరి గణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. గతంలో ఇదే తరహా డిగ్రీలతో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చే సరికి నిబంధనలు మార్చడం సమానత్వపు హక్కును కాలరాయడమే. పాత తప్పులను సరి దిద్దే క్రమంలో కొత్త తరం యువతను బలిపీఠం ఎక్కించడం ప్రభుత్వ చేతకానితనం. ఒక నిరుద్యోగి ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుని, నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి, పరీక్ష రాసి అర్హత సాధించిన తర్వాత.. ‘నీ డిగ్రీ చట్ట విరుద్ధం’ అని చెబితే ఆ అభ్యర్థి మానసిక స్థితి ఏమవుతుందో పాలకులు ఊహించగలరా? ఇన్నేళ్ల కాలంలో విద్యార్థులు వెచ్చించిన సమ యం, డబ్బు, శ్రమకు విలువ ఏది? వారి వయస్సు మించిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ కొత్తగా డిగ్రీలు చేయమంటే అది సాధ్యమయ్యే పనేనా?
పరిష్కారం ఎక్కడ? – ప్రభుత్వ తక్షణ కర్తవ్యం
ఈ సంక్షోభం నుంచి విద్యార్థులను గట్టెక్కించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉంది. కోర్టు తీర్పును గౌరవిస్తూనే, మానవతా దృక్పథంతో ఇప్పటికే డిగ్రీలు పూర్తి చేసిన వారికి లేదా ఆఖరి సంవత్సరంలో ఉన్న వారికి మినహాయింపునిచ్చేలా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో యూజీసీతో చర్చించి, ఒక ప్రత్యేక గెజిట్ ద్వారా పాత డిగ్రీలకు గుర్తింపునిచ్చేలా ఒత్తిడి తీసుకురావాలి. నిబంధనలు ఉల్లంఘించిన యూనివర్సిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకూడదు. అక్షరం ఓడిపోతే అది సమాజపు ఓటమి. పాలకులారా, మీ నిర్లక్ష్య ంతో ఒక తరం యువతను రోడ్డున పడే యకండి. చట్టాల పేరుతో విద్యావంతులను నిరుద్యోగులుగా మార్చడం ఆపండి.
చరిత్ర క్షమించని విద్యా ద్రోహం
ఇప్పటికైనా మేల్కొని విద్యార్థుల భవి ష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీదే, లేదంటే చరిత్ర మిమ్మల్ని విద్యా ద్రోహులుగా ముద్ర వేస్తుంది. అక్షరానికి ఆంక్షలు విధించే ఏ వ్యవస్థ అయినా ఎక్కువ కాలం నిలబడదు. అది తిరుగు బాటుకు దారితీస్తుంది. విద్యార్థుల ఆవేదనను అలకించి, తక్షణమే ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాం. ప్రభుత్వం తలచు కుంటే అసాధ్యమేమీ లేదు, చట్టం పేరుతో జరుగుతున్న ఈ అన్యాయాన్ని అడ్డుకోవడమే ఇప్పుడు తక్షణ అవసరం. విద్యార్థి లోకం ఈ వివక్షను ఎన్నటికీ క్షమి ంచదు. పాలకులారా.. మీ పట్టింపు లేని ధోరణి లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేస్తోందని గుర్తించండి. తక్షణమే జోక్యం చేసుకుని అభ్యర్థులకు భరోసా ఇవ్వండి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




