చెట్టును ఢీకొని కుప్పకూలిన ప్రైవేట్ జెట్

– ఇద్దరు పైలట్లు మృతిచెందినట్లు గుర్తింపు

రాయపూర్, ఏప్రిల్ 20: ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారం కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో చెట్టును ఢీకొని కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్టు ప్రాథమిక సమాచారం. జెట్ కుప్పకూలిన సమయంలో అందులో ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. జెట్ కుప్పకూలిన సమాచారం తెలిసిన వెటనే ఎసఎస్‌పీ లాల్ ఉద్ సింగ్ సహా సీనియర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *