– విద్య, క్రీడలు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
– మంత్రి పొంగులేటి
– ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనానికి శంకుస్థాపన
దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, మే 2: ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికే ప్రాధాన్యమి స్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మం డలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శం కుస్థాపనలు నిర్వహించారు. ముందుగా దు మ్ముగూడెం మండలం బండిరేవు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చే శారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీ ణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమై న విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా విద్యార్థులకు
విద్యతో పాటు వసతి, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందిస్తామన్నారు. ఆధునిక తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, హాస్టల్ వసతులు ఒకే చోట ఉంటాయని చెప్పారు. అనంతరం చింతగుప్ప గ్రామం నుంచి బురద మడుగు వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డుతో చింత గుప్ప, బురదమడుగు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమవుతందని తెలిపారు. ములకపాడులోని మినీ స్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ తో కూడిన మినీ ఇం డోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి శంకు స్థాపన చేశారు. మినీ ఇండోర్ స్టేడియంలో కల్పించిన సదుపాయాలను జిల్లా కలెక్టర్ అంకితో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టులో మంత్రి, కలెక్టర్ కలిసి షటిల్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరేలా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రా మీణాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకె ళ్లే దిశగా రహదారులు, విద్య, ఆరోగ్యం, క్రీడా రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశల వారీగా అందిస్తూ సమగ్ర అభివృద్ధి సా ధనలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మా ట్లాడుతూ దుమ్ముగూడెం మండలంలో చేపడు తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎం తో ఉపయోగపడతాయని తెలిపారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం ద్వారా జిల్లాలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురా వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఈ పాఠశాలలో సుమారు 2,000 నుండి 2,500 మంది విద్యార్థులు ఒకేచోట విద్యనభ్యసించే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. కార్య క్రమాల్లో ఎస్పి రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భూ సమస్యలకు 2 నెలల్లో పూర్తి పరిష్కారం
నేలకొండపల్లి/ఖమ్మం : ప్రజల వద్దకే పాలన అందించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామని, ఇక్కడ ప్రజలు ఇచ్చిన ప్రతీ వినతికి న్యాయం చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్ లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోదులబండ క్లస్టర్‌లో 12 గ్రామాలు ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గత 2.4 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి నాయకత్వం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఇది 5వ ప్రజాదర్బార్ సమావేశమని, ప్రతి సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులే అధికంగా వస్తున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకపోవడం వల్లే ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, తమ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వడమే కాకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేయడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. మే నెలాఖరులో రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.పార్టీలకు అతీతంగా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, మూడవ, నాలుగవ దశల్లో కూడా ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. భూమి సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంటూ, గత ప్రభుత్వ ధరణి విధానం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. రాబోయే 2 నెలల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. భూ భారతి ద్వారా అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి సూచనల మేరకు కొన్ని సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కొన్ని వినతులను 7 రోజుల్లో, మరికొన్నింటిని 3 నెలల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి వినతిని పారదర్శకంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





