– అర్హులందరికీ న్యాయం చేయడమే లక్ష్యం
– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
– హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో లబ్ధిదారుల ఎంపిక
హుస్నాబాద్, ప్రజాప్రతంత్ర, అక్టోబర్ 23: ఇళ్లు లేని నిరుపేదలకు, గుడిసెల్లో జీవనం సాగిస్తు న్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి భారీగా డిమాండ్ ఉ న్న నేపథ్యంలో, అత్యంత దయనీయ పరిస్థితు ల్లో నివసిస్తున్న పేదలకు ముందుగా సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించిందని ఆయన తెలిపారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, విస్తరణ పనుల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు సైతం నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కేటాయి స్తామని మంత్రి హామీ ఇచ్చారు. గౌరవెల్లి-గండిపల్లి ప్రాజెక్టు నిర్మాణం కారణం గా ఇళ్లు కోల్పోయి, ఇప్పటివరకు ఎలాంటి నివాసం పొందని వారిలో స్థలం ఉండి అర్హత కలిగిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఇల్లు మం జూరు చేస్తామన్నారు. కొత్తపల్లి నుంచి హు స్నాబాద్ నాలుగు వరుసల రహదారి విస్తరణలో చిగురుమామిడి, సుందరగిరి ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి, అలాగే హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి జన గామ మార్గంలో (అక్కన్నపేట మీదుగా) ఇళ్లు కోల్పోయిన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.హుస్నాబాద్ చౌటపల్లి వద్ద ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారిలో అర్హత ఉండి, ఇల్లు లేని కుటుంబాలకు కూడా ఇళ్లు కేటాయిస్తామన్నారు. నియోజకవర్గంలో అర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, నిజమైన పేదలు, నివాసాలు కో ల్పోయిన అత్యంత ఆవశ్యకత ఉన్న కుటుంబా లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా శ్రమిస్తానని పునరుద్ఘాటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





