మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి
నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌
‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌
ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌

‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ నదిని పునరుజ్జీవింప జేయాల్సిందేనని పలువురు మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే మూసీ ప్రక్షాళన అంటే కేవలం ఇళ్లను కూలగొట్టడం కాదనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రక్రియతో ప్రభావితం కానున్న బాధితులతో ముందుగా ప్రభుత్వం చర్చించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా బాధితులు తమ బాధలను, సమస్యలను పూర్తిగా మానవీయ కోణంలో పరిష్కరించాలన్నారు. ప్రతి బాధితుడికి సంపూర్ణమైన పరిహారం చెల్లించడంతో పాటు జీవనోపాధి చూపిన తర్వాతే మూసీ పునరుజ్జీవం చేపట్టాలని ప్రభుత్వానికి వారు సూచించారు.
గురువారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘హైడ్రా కార్యకలాపాలు మూసీ నది ప్రక్షాళన పేద, మధ్య తరగతి బాధితులకు ప్రత్యామ్నాయం’ అంశంపై సెమినార్‌ ‌నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ ‌కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో  ఎంఎల్సీ ప్రొఫెసర్‌ ఎం.‌కోదండరామ్‌, ‌మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కె.నాగేశ్వర్‌, ‌ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌, ‌ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్‌, ‌సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ ‌కె.నారాయణ ప్రసంగించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ.. నగరంలోని ప్రజలందరికీ ఇక్కడ జీవించే హక్కు ఉందని, అయితే ఆ జీవనం మూరికి కూపంలో కాకుండా ఆహ్లాదకరమైన కాలుష్యం లేని వాతావరణంలో స్వచ్ఛమైన గాలి, నీరు, విద్య, వైద్యంలో కూడిన సౌకర్యాలతో కూడినదై ఉండాలన్నారు. సరళీకృత విధానాలు అమల్లోకి వొచ్చినప్పటి నుంచి నగర అభివృద్ది అనేది ప్రజల కోసం కాకుండా పెట్టుబడులను ఆకర్షించడం కోసమే అన్నట్లుగా మారిపోయిందన్నారు.
ఈ నేపథ్యంలో నగరంలో ఒక సుస్థిర అభివృద్ది జరగాలని, అది అందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండి ఆ అభివృద్దిలో తను కూడా ఓ భాగస్వామిని అనే భావన కలగాలన్నారు. కె.శ్రీనివాస్‌ ‌మాట్లాడుతూ మూసీ నది ఈ దుస్థితికి ఒక్కరే కారణం కాదని, గత 70 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాలే  ప్రధాన కారణమని అన్నారు. ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌మాట్లాడుతూ.. ప్రస్తుతం అభివృద్ది నమూనా అనేది పెట్టుబడి వ్యవస్థ చూట్టు తిరుగుతోందని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యవస్థే నేడు ప్రభుత్వాలను ముందుండి నడిపిస్తున్నాయన్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం ప్రభుత్వాన్ని నడుపుతోందని, అయితే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మూసీ ప్రక్షాళనలో కనీసం ప్రభుత్వం తమను చర్చించేందుకు పిలిచి మాట్లాడిందన్నారు. ఇదే క్రమంలో తాము సలహాలు, సూచనలు అందజేశామని చెప్పారు. మూసీ పునరుజ్జీవం ఎంత అవసరమే ప్రజల ముందు అవగాహన కల్పించి, వారిని చైతన్యం చేయాలని సూచించామన్నారు. ఈ సెమినార్‌ ‌లో సిపిఐ జాతీయ కౌన్సిల్‌ ‌సభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *