prajapalana vijayostavalu ముమ్మరంగా సాగుతున్న విజయోత్సవాల ఏర్పాట్లు

  • నెక్లెస్ రోడ్ లో బిర్యాని, చాట్, ఐస్ క్రీం, తెలంగాణా, నార్తన్ తదితర వెరైటీ ఫుడ్ స్టాళ్ళ ఏర్పాటు
  • సాయంత్రం నగర వాసులను అలరించనున్న వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్
ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పి.వి .నర్సింహ రావు మార్గ్ లో నరగంలోని ప్రముఖ హుటల్స్ పుడ్ స్టాళ్లను నేటి నుండి 9 తేది వరకు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ , మొగలాయి, తెలంగాణా, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరి ఐటమ్స్ ఐస్ క్రిమ్ పార్లర్లను విజయోత్సవాల్లో పాల్గోనే సందర్శకుల సౌకర్యార్థం వందకు పైగా ఫుడ్ స్టాళ్లను అందుబాటులొకి తెచ్చారు. నేడు సాయంత్రం జరిగే వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్ నిర్వహణకు ఐమాక్స్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో విశాలమైన స్టేజి నిర్మాణం, సౌండ్ సిస్టం తోపాటు సందర్శకులకు సీటింగ్ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావొచ్చాయి.
ఈ ఏర్పాట్లను సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ డా. హరీష్ తోపాటు శాఖ ఉన్నతాధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరోందిన హైద్రాబాదీ దమ్ బిర్యాని తోపాటు మొగలాయి, జఫ్రాని బిర్యాని పర్యాటకులకు అందిచేదుంకు ప్రముఖ హోటళ్ళయిన ప్యారెడైజ్, పిస్తా హౌజ్, షాదాబ్, బడేమియా కబాబ్ తదితర హోటళ్లు తమ బ్రాండ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.

వీటితోపాటు తెలంగాణ వంటకాలుగా పేరొందిన పాలమార్ గ్రీల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటు కోడి చికెను, పుడ్ జాయింట్స్ ను అందుబాటులోకి తెచ్చారు.. నిలోఫర్ కెఫె, బ్రౌన్ బేర్ బేకరిలు ప్రాంకిల్ మ్యాగి హాట్స్పాట్ కాంటినెంటల్ కాఫీ, ప్రాంకి అండ్ రోల్స్, మొమోస్ అండ్ ప్రైస్ తో పాటు గోకుల చాట్ కూడ తమ సంస్థ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేసారు. వీటి,తో పాటు ఆగ్రా చాట్ అండ్ స్వీట్స్ ఐస్ కంనష్సన్ ఎం బైట్స్, స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు స్త్రీ శక్తి క్యాంటిన్లను కూడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *