13న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

– ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్రంలో ఈనెల 13న నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 56,494 మంది విద్యార్థులు, 49,945 మంది విద్యార్థినులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 293 పరీక్ష కేంద్రాను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ కానీ, ఏ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *