– ‘నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం
– సీబీఐ నివేదికలో వెలుగులోకి కీలక విషయాలు
న్యూదిల్లీ, జూలై 16: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రసాయన శాస్త్ర ప్రశ్నపత్రాల సెట్లలోని 111 ప్రశ్నలను రూ.5 లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు లభించాయని సీబీఐ తెలిపింది. ఈ మేరకు కేసు దర్యాప్తు వివరాలను ప్రత్యేక కోర్టుకు వెల్లడించింది. నిందితుడిగా ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన నివేదికలో సీబీఐ పలు కీలక ఆధారాలను ప్రస్తావించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన శివరాజ్.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీలో సభ్యుడైన పీవీ కులకర్ణి నుంచి నీట్ ప్రశ్నలను సేకరించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. కులకర్ణి నిర్వహించిన కోచింగ్ తరగతులకు శివరాజ్ కుమారుడు హాజరయ్యాడని పేర్కొంది. కేసు దర్యాప్తులో భాగంగా శివరాజ్ ఫోన్‌ను పరిశీలించగా.. అందులో 36 ఫొటోలు లభించినట్లు సీబీఐ తెలిపింది. వాటిలో చేతితో రాసిన 132 రసాయన శాస్త్ర ప్రశ్నలు ఉండగా.. అందులో 111 ప్రశ్నలు నీట్ యూజీ 2026 మాస్టర్ పేపర్‌లోని ప్రశ్నలతో సరిపోలినట్లు వెల్లడించింది. రసాయన శాస్త్ర ప్రశ్నలకు సంబంధించిన చేతిరాత నోట్స్ నిందితుడు రాసినవేనని తాము భావిస్తున్నట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. మే 3న జరిగిన నీట్ పరీక్షకు దాదాపు 10 రోజుల ముందు ఈ ఫొటోలు తీసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేయగా వారందరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ తెలిపింది. శివరాజ్ మోటెగావ్‌కర్ మొబైల్ ఫోన్‌లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన క్వశ్చన్ పేపర్ సెట్‌తో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. లాతూర్‌లో రేణుకై కెమిస్టీ క్లాసెస్ నిర్వహిస్తున్న శివరాజ్ మోటెగావ్‌కర్, ’మోటెగావ్‌కర్ సర్‌స్ ఆర్‌సీసీ’ పేరుతో సుమారు 1.68 లక్షల మంది సబ్‌స్కైబ్రర్లు ఉన్న యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. అతను ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను సీబీఐ పరిశీలించగా, అందులో కెమిస్టీక్రి సంబంధించిన 132 చేతిరాత ప్రశ్నలు ఉన్న 36 ఫొటోలు లభించాయి. వాటిలో ఐదు ఫొటోలు ఒకే విధంగా ఉండగా, మిగిలిన ఫొటోల్లో ఉన్న చేతిరాత ప్రశ్నలు శివరాజ్ మోటెగావ్‌కర్ రాసినవేనని సీబీఐ భావిస్తోంది. సీబీఐ దర్యాప్తు ప్రకారం.. మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్షకు దాదాపు 10 రోజుల ముందే, అంటే ఏప్రిల్ 23న శివరాజ్ మోటెగావ్‌కర్‌కు లీకైన ప్రశ్నలు అందినట్లు తెలుస్తోంది. లాతూర్‌కు చెందిన డాక్టర్ మనోజ్ శిరూరే, మాజీ ఎన్‌టీఏ ప్యానెల్ సభ్యుడు, రిటైర్డ్ కెమిస్టీ లెక్చరర్ పీవీ కులకర్ణి ద్వారా ఈ ప్రశ్నలు మోటెగావ్‌కర్‌కు చేరినట్లు సీబీఐ తెలిపింది. ఇందుకోసం రూ.5 లక్షలు చెల్లించినట్లు కూడా ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే మోటెగావ్‌కర్‌ను అరెస్టు చేసిన సీబీఐ, అతని బెయిల్‌ను వ్యతిరేకిస్తూ దిల్లీ కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. అలాగే, లీకైన ప్రశ్నపత్రం పీడీఎఫ్ కాపీలను టెలిగ్రామ్ ద్వారా రూ.10 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షకు కొన్ని వారాల ముందే 410 ప్రశ్నలతో కూడిన 150 పేజీల ’అంచనా ప్రశ్నపత్రం’ను కొంతమంది అభ్యర్థులకు అందించినట్లు సీబీఐ తెలిపింది. అందులోని సుమారు 120 ప్రశ్నలు నీట్-యూజీ 2026 కెమిస్టీ ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పరీక్షకు ముందే ప్రశ్నపత్రంలోని కీలక ప్రశ్నలు కొందరి చేతికి చేరినట్లు సీబీఐ గుర్తించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





