– ‘నీట్’ అక్రమాలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
– దిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర లాఠీఛార్జ్ పై సర్వత్రా నిరసనలు
– ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన రాహుల్ గాయం!
– హైదరాబాద్లో ఉద్రిక్తంగా గాంధీభవన్, రాజభవన్ పరిసరాలు
– కేంద్రంతో జంతర్ మంతర్ వద్దే చర్చలకు విద్యార్థుల పట్టు
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
దిల్లీలో రాచుకున్న ‘కాక్రోచ్’ మంటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దావానలంగా మా రాయి. కాక్రోచ్ నిరసనలతో దిల్లీలోని జం తర్మంతర్ నిరంతరం చర్చనీయాంశంగా మారినట్లే దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యాలయాలు ఉద్రిక్తతలకు నెలవై నాయి. ప్రధానంగా తెలంగాణలో ఇది ఉగ్రరూపం దాల్చింది. కాక్రోచ్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం రక్తసిక్తం కావడంతో జాతీయ ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ రంగంలోకి దిగింది. నిరుద్యోగం, పేపర్ లీకేజీ లాంటి విద్య, ఉపాధి రంగాలకు సంబందించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బొద్దింక జనతాపార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిం దే. 32 రోజులుగా చేపట్టిన వారి ఆందోళన సోమవారం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నది కాక్రోచ్ పార్టీ ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్తో జం తరంతరు చేరుకున్న లక్షలాది మంది విద్యార్థులు, వారికి మద్దతిస్తున్న వారి తల్లి దండ్రులు, సామాజిక వేత్తల ఆందోళనకు అనుమతి ఇవ్వని కేంద్రం వారిపై లాఠీలు ఝుళిపించింది, బాష్పవాయు గోళాలను ప్ర యోగించింది. దీంతో విద్యార్థివర్గం తిరగ బడింది. పోలీసులపై రాళ్ళదాడి చేసింది. ఫలితంగా ఇరు వర్గాలకు సంబంధించి దా దాపు రెండు వందలమందికి పైగా గాయపడ్డారు. దీన్ని నిరసిస్తూ జాతీయ కాంగ్రెస్ ఆందోళన దీన్ని నిరసిస్తూ జాతీయ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, యూపి మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు సరాసరి ప్రధాని నరేంద్రమోదీ నివాసం ముందు ధర్నాకు ఉపక్రమించడం ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, దిల్లీ హింసపై విచారణ చేపట్టాలన్నది కాంగ్రెస్ ప్రధాన డిమాండ్. అయితే కాంగ్రెస్ నాయకులను ప్రధాని నివాసానికి రాకుండా అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్బంగా రాహుల్ ముక్కుకు స్వల్పంగా గాయమై రక్తం వచ్చింది.
ఇప్పటికే కాక్రోచ్ పార్టీ చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు లబిస్తుండగా రాహుల్, ప్రియాంకగాంధీలపట్ల కేంద్రం దురసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలకు దిగింది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బిజెపిగా ఆందోళనలు చెలరేగాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా నిరసనలో పాల్గొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. నీట్ పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని మోదీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా కాంగ్రెస్ శ్రేణులు చలో లోక్ భవన్- చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. పెద్దఎత్తున రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ మంత్రులు, ఎంఎల్యేలు, ఎంఎల్సీలు, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క బిజెపి కార్యాలయంపై దాడికి బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలనుకూడా పోలీసులు నిరోదించారు. కాగా,తమ కార్యాయలంతోపాటు రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నాన్ని బిజెపి నాయకులు, కార్యకర్తలు సీరియస్‌గా తీసుకోవడంతోపాటు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో రాష్ట్ర రాజధానిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. కోడిగుడ్లను, రాళ్ళను విసురుకున్నారు. బిజెపి కార్యకర్తలు గాంధీభవన్ ముందున్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించిపారేశారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతోపాటు పలువురిని పోలీసులు అరెస్టుచేశారు. అసలే తెలంగాణలో భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బలమైన ప్రతిపక్షంగా ఎదగడానికి బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. రానున్న కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ప్రజల్లో తమ బలాన్ని నిరూపించుకునే క్రమంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రెండు పార్టీలు తీవ్రంగా పోటీ పడ్డాయనే చెప్పాలె.
కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న కాక్రోచ్ పార్టీ
కాక్రోచ్ పార్టీ ఆందోళన నేపథ్యంలో కేంద్రానికి దిగిరాక తప్పలేదు. ఇప్పటికే సిజెపి పార్టీ ముఖ్యనేతలతో ఒకసారి భేటీ అయిన కేంద్ర మంత్రులు బుధవారం మరోసారి బుధవారం భేటీకి సిద్దమైనారు. అయితే ఈ చర్చలకోసం కేంద్ర మంత్రి నడ్డా స్వగృహానికి రావల్సిందిగా ఇచ్చిన ఆహ్వానాన్ని సిజెపి నాయకులు తిరస్కరించారు. ఎక్కడైతే తమపైన దాడి జరిగిందో అదే జంతర్‌మంతర్ వద్ద అందరి సమక్షంలో చర్చించాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. కాగా సిజెపి షరతుల్లో ప్రధానమైనాది ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను హాస్పిటల్ నుండి విడుదల చేయడంతోపాటు, ఆయన జంతర్‌మంతర్‌లోనే దీక్ష విరమించేట్లు చర్యలు తీసుకోవాలన్నది ఒకటికాగా, మొదటినుండి తాము డిమాండ్ చేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న ప్రతీ నీట్ విద్యార్థి కుటుంబ సభ్యులకు కోటి రూపాయలను అందజేయటం, ఉద్య మించిన విద్యార్ధులెవరిపైనా ఎలాంటి కేసులు పెట్టకూడదన్న వారి ప్రధాన డిమాండ్‌లను వారు కేంద్రం ముందుంచారు. కాగా బుధవారం జరిగే చర్చలు ఎటుదారితీస్తాయన్న విషయంలో దేశవాసులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





