“ప్రకృతి పూజా కార్యక్రమం గా ప్రకృతి ని ఆస్వాదించాలసిన ఈ కార్యక్రమంలో ప్లాస్టీక్ ప్లేక్సీలు విపరీతంగా కట్టి వాతావరణం కాలుష్యం కు కారకం అవుతున్నారు.పెద్దపెద్ద శబ్దాలతో డిజిటల్ సౌండ్ సిస్టం వాడకం ద్వారా ధ్వని కాలుష్యం సైతం జరుగుతుంది.అసభ్యకర నృత్యాలు కు వేదిక అవుతుంది.ఇక్కడ మాంసాహారం లాంటివి వినియోగం చేయడం వలన కార్తీక సమారాధన కాన్సెప్ట్ కే తూట్లు పొడుస్తున్నారు.అన్నింటికీ మించి కులం సెంటిమెంట్ రగిలించడానికి వాడుతున్న ఈ వనసమారాధన కాస్తా అసహజ సమారాధనా కార్యక్రమం గా మారిపోయింది.,”

(పొలిటికల్ ఎనలిస్టు, సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు)
సెల్:9441864514, ఇమెయిల్: thirmal.1960@gmail.com.
తెలుగు వారికి మాత్రమే ఉన్న అద్భుత సాంప్రదాయం వనభోజనాలు. అలాంటి వన భోజనాలు కుల భోజనాలు గా ఎలా మారాయి? కార్తీక మాసం వనసమారాదన కాస్తా కులబల ఆరాధన గా ఎలా మారింది? వాస్తవంగా కుల,మత ప్రభావాలు తగ్గించడానికి పూర్వీకులు పెట్టిన ఒక సాంప్రదాయాన్నికూడా కలుషిత రాజకీయ వ్యవస్థ కుల బలనిరూపణకు వాడుకొని ఎలా కలుషితం చేస్తుంది? ఇత్యాది ప్రశ్నలు వెన్నాడుతూనే ఉంటాయి.వాస్తవంగా ఈ “కార్తీక వనసమారాధన”అనబడే ప్రక్రియ ఈనాటిది కాదు.సుమారు 2వేల సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగి ఉంది.వనంలో భోజనాలు అనే ప్రక్రియ వేద కాలం నుండి ఉంది.ఆనాటి రుషులు కార్తీక మాసం లో యజ్ఞ,యాగాదులు చేసి వనంలోనే సహపంక్తి భోజనాలు చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొదలైంది.అటు తర్వాత తెలుగు దేశాన్ని పాలించిన శాతవాహన రాజులు కార్తీక వన సమారాధన పేరుతో ‘ఉసిరి’వనంలో ప్రజలకు సామూహిక వనభోజనాలు ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ వనభోజనాలు అనబడే విషయం బలపడడానికి అనేక కారణాలు ఉన్నాయి.1) ఆయుర్వేద శాస్త్రం మూలం లోనికి వెళితే కార్తీక మాసం చలితో ప్రారంభం అవుతుంది.ఉసిరి చెట్లు విరివిగా కాస్తాయి.ఉసిరి వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయడం ద్వారా ఆ చెట్టు గాలిలో ఉన్న ఔషధ గుణాలు కూడా తమ శరీరానికి మేలు చేస్తాయనేది ప్రజల ప్రగాఢ నమ్మకం.2) బతుకమ్మ తర్వాత వనభోజనాలు ప్రకృతి పండుగగా చూడవచ్చును.పంటలు దండిగా ఇంటికొచ్చే కాలం,అడవులు పచ్చదనం తో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.బయట ప్రకృతి లో బోజనం చేయడం ఓ ఆనందం కలుగుతుంది.3) కార్తీక వన సమారాధన విషయం లో అనేక పురాణ ప్రాశస్త్యం ఉంది.దేవతలు, రుషులు కార్తీక మాసం లో తులసి,ఉసిరి వనాలలో విష్ణుమూర్తి రూపం అయిన దామోదరుడి విగ్రహం పెట్టి పూజించేవారని,ఈవనాల్లో భోజనం చేయడం వలన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది అనే భావన ప్రజల్లో ఉండేది.4)వీటన్నింటికీ మించి దీనిలో సామాజిక ప్రయోజనం కూడా బలంగా ఇమిడి ఉండేది. పురాతన కాలం నుండి మన సమాజం లోకుల,మత అంతరాలు ఉండేవి.అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయడం ద్వారా అందరూ సమానమే నన్న సమానత్వ భావన బలపడడానికి పెద్దలు ఈ పండుగ కుల, మతాలకతీతంగా జరిపించే వారు.5)కార్తీక మాసం వేల వనంలో దీపాలు వెలిగించి ఆకాశం క్రింద భోజనం చేయడం వలన ప్రకృతికి దగ్గరగా ఉన్నామనే భావన మనిషి అనంతరంగంలో బలపడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఈ పండుగ వాతావరణం కాన్సెప్ట్ కే ఆధునిక సమాజం ఎసరు పెట్టింది.కుల మత భావన సన్నగిల్లడాని కి పెట్టిన సాంప్రదాయాన్ని కులం,మతం మరింత బలపడే,స్వీకరించే దిశగా సామాజిక విభజన దిశగా వనభోజనాలు కార్యక్రమం మార్పు చెందింది.
వాస్తవానికి వనభోజనం కార్యక్రమం తొలుత అగ్రకులాలు,ఆధిపత్యం కులాలు గా గుర్తించబడ్డ వైశ్య,రెడ్డి,కమ్మ,వెలమ,బ్రాహ్మ
ఉమ్మడి కుటుంబం, పశుసంపద పుష్కలంగా ఉన్న కాలంలో గ్రామాలకు సమీపంలో సహజ అడవులు,నీటి వనరులు పుష్కలంగా ఉండేవి.అట్లాంటి ఆహ్లాదకర ప్రదేశం ఎంపిక చేసుకొని ఎడ్ల బండ్లు పై కుటుంబాన్నీ సామూహికంగా కుల,మత రహితంగా సమీప అటవీప్రాంతం లోనికి వెళ్ళి ఒక జాతర లాగా జరుపుకునే వారు.నేడు గ్రామాల్లో వాతావరణం సన్నగిల్లింది.ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి.గ్రామాల సమీపంలో అడవులు అంతరించాయి.ఉసిరి వనాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు.ఫలితంగా వనసమారాధన పల్లెల్లో అంతరించి పట్టణాలకు వలస పోయింది.కాంక్రీటు జనారణ్యాలు గా మారిన పట్టణాల్లో ఈ వనసమారాదన కృత్రిమ ఏర్పాట్లతో జరుపుకుంటున్నారు.పాత కాన్సెప్ట్ కు బదులు కుల పరమైన విభజనతో ఏ కులానికి ఆ కులం ఈ కార్తీక వన సమారాధన కుల బలనిరూపణ కార్యక్రమం గా మార్చి వేశారు.కాస్త డబ్బులు దండిగా ఉన్న రాజకీయ నేతలు తేలిగ్గా కులం పేరుతో బలసమీకరణ చేయడానికి ఈ కార్యక్రమం ఇప్పుడు వినియోగపడుతుంది.ఇక్కడ ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు,పూజలు, భోజనాలు, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు అన్నీ కూడా ధనికులైన ఆయా రాజకీయ నేతలు,కులం సంఘాల కనుసన్నల్లోనే జరిగి పోతున్నాయి.సమాజాన్ని చీలికలు,పేలికలు చేసిన కుల సంఘాలకు ఇదొక కులవిభజన సాంస్కృతిక ఉత్సవంగా ప్రతిఏటా తోడ్పడుతుంది..ఇదొక కుల బల ప్రదర్శనా క్షేత్రంగా వనసమారాధన మారిపోయింది.
ఆధునిక రాజకీయ స్వార్థం అవధులు కూడా దాటి కార్తీక వన సమారాధన కార్యక్రమం ను వినియోగించుకుంటుంది.మనిషిలో తల ఎత్తిన స్వార్థ చింతనకు ఏ పండుగా పబ్బం కూడా అతీతం కాదని నిరూపణ జరిగింది.ప్రకృతి పూజా కార్యక్రమం గా ప్రకృతి ని ఆస్వాదించాలసిన ఈ కార్యక్రమంలో ప్లాస్టీక్ ప్లేక్సీలు విపరీతంగా కట్టి వాతావరణం కాలుష్యం కు కారకం అవుతున్నారు.పెద్దపెద్ద శబ్దాలతో డిజిటల్ సౌండ్ సిస్టం వాడకం ద్వారా ధ్వని కాలుష్యం సైతం జరుగుతుంది.అసభ్యకర నృత్యాలు కు వేదిక అవుతుంది.ఇక్కడ మాంసాహారం లాంటివి వినియోగం చేయడం వలన కార్తీక సమారాధన కాన్సెప్ట్ కే తూట్లు పొడుస్తున్నారు.అన్నింటికీ మించి కులం సెంటిమెంట్ రగిలించడానికి వాడుతున్న ఈ వనసమారాధన కాస్తా అసహజ సమారాధనా కార్యక్రమం గా మారిపోయింది.ఇప్పటికైనా ప్రజలు కులమతాలకతీతంగా, ప్రకృతి వనరులు పరిరక్షణ,వాతావరణం సమతౌల్యం కాపాడే దిశగా పురాతన కాన్సెప్టుతో జరుపుకోవాలసిన అవసరం ఉంది.ఆధునిక రాజకీయ మాయా మేయా రాజకీయ ప్రపంచం కుల ఉన్మాదులకు వేదిక కాకుండా “కార్తీక వన సమారాధన కార్యక్రమం రూపకల్పన చేసుకోవడం ప్రజలకు అన్నిరకాలుగా ఆరోగ్య దాయకం అవుతుంది.అంతేకాదు,క్షిణించి పోతున్న ఉమ్మడి కుటుంబం,గ్రామీణ సాంస్కృతిక వ్యవస్థ పునర్ నిర్మాణం కోసం”కార్తీక వన సమారాధన కార్యక్రమం తోడ్పడుతుంది.అందుకోసం కార్తీక వన సమారాధన పునరుజ్జీవనం పొందాలని కోరుకుందాం..





