– సీఎంకు కృతతలు తెలిపిన మంత్రి సీతక్క
ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : చిన్న ఇల్లు నిర్మించుకోవాలంటే ఆదివాసీలకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులుంటాయి.. వాళ్లది సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి.. అలాంటిది రూ.5 లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం హర్షణీయమని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ·మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మరీ ముఖ్యంగా ప్రిమిటివ్ ట్రైలర్‌కు ఇల్లు కట్టించి ఇవ్వడం జీవితాంతం గుర్తుంచుకునే సందర్భం అని అన్నారు. కొఠారిలో ఇందిరమ్మ ఇండ్లలో ప్రవేశించిన ఆదివాసీ లబ్దిదారులతో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడి టీచర్లు, హెల్పర్ల భర్తీ ప్రక్రియను తక్షణం చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలిస్తున్నామని చెప్పారు. స్థానికులకు అంగన్వాడి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ గ్రామంలో తాగునీటిని ఇచ్చేందుకు గ్రామ పంచాయతీ నిధులను వెచ్చిస్తామన్నారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి విచ్చేసిన పేదల పెన్నిధి, బలహీన వర్గాల ఆకాంక్షలను, అవసరాలను గుర్తించి సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, తరలివచ్చిన ప్రజలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటాలు చేశారని, నాడు ఇందిరమ్మ పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చింది.. ఇందిరమ్మ ఆశయాలను ఇందిరమ్మ ఇండ్ల రూపంలో రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. సమాజానికి దూరంగా పేదరికంతో ఉన్న వాళ్లను అభివృద్ధి పథంలో తీసుకురావడమే సమాజాభివృద్ధి అవుతుందన్నారు. ఆ దృక్పథంతోనే ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుకు గురైందని, సాగునీరు, యువతకు ఉపాధి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరగాలని, ఆదివాసీలు, అణగారిన వర్గాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అని సీతక్క అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





